• 5-5-2010

  • మార్కెట్  రిపోర్ట్

ఐరోపా   మార్కెట్ల  లో  చోటు చేసుకున్న  బలహీనత వలన  నేడు వరుసగా   రెండవ  రోజు కూడా మన  మార్కెట్లు  నష్టపోయాయి.  ఐతే   మధ్యాన్నం  తదుపరి  షార్ట్  కవేరింగ్  చోటు చేసుకోవటం,  చౌక  బేర సారాలు    కొనసాగటం  తో  మార్కెట్లు  కోలుకున్నాయి.  ఐనప్పట్టికీ   గ్రీన్  మార్కు  ని  చేరుకోలేకపోవటం  తో  బొంబాయి స్టాక్ మార్కెట్  సూచీ  సెన్సెక్స్  49  పాయింట్ల   నష్టం  తో 17088 పాయింట్ల  వద్ద  ముగిసింది.  కాగా   నిఫ్టీ  23. 6 పాయింట్ల  నష్టం  తో  5125  పాయింట్ల  వద్ద  స్థిరపడింది. ఒక దశ లో    సెన్సెక్స్   17   వేల  మార్కు  కంటే దిగువన  ట్రేడ్ అయ్యింది.  ఐతే  అమెరికామార్కెట్ల  తాలూకు   ఫ్యు చేర్స్    పెరగటం  తో   సెన్సెక్స్  తిరిగి  పుంజుకుని   17 088   పాయింట్ల  వద్ద స్థిరపడింది.

నేటి   ట్రేడింగ్  లో  మిడ్ క్యాప్ రంగం 0 .30  శాతం  లాభపడటం  విశేషం . ఐతే స్మాల్ క్యాప్ రంగం  మాత్రం 0.24శాతం  నష్టపోయింది.
 సేక్టో రల్  రంగాల  లో నేడు కూడా  మెటల్స్ , రియాలిటి  రంగాలు    అత్యధికం గా   నష్టాలను  నమోదు  చేసాయి,  ఈ  రంగాలు   1.07 % , 1.03 % చొప్పున  బలహీన పడ్డాయి.  కాగా  నేడు  మార్కెట్లు   పుంజుకునేందుకు  టెక్  రంగం  ( 0 .95 % ),  ఐ. టి ( 0.92 % )    దోహద పడ్డాయి

స్టాకుల  వారిగా   నేడు  BHARTI AIRTEL ,MNM, WIPRO, HINDALCO , MARUTI SUZUKI, TCS, INFOSYS  లో   " BOTTOM FISHING "  చోటు చేసుకుంది.   గ్రీస్  దేశపు  సంక్షోభం  కారణం  గా రూపాయి   విలువ  అంతర్జాతీయ మార్కెట్ల  లో పడిపోవటం  తో   ఐ. టి.  స్టాకులు   లాభపడ్డాయి . కాగా   HDFC, ICICI BANK  1.3 %  చొప్పున  నష్టపోయాయి. అంతర్జాతీయ  విపణుల  లో  ముడి చమురు  ధర తగ్గటం తో   BPCL  2.25 % , HPCL 0. 72 %  లాభపడ్డాయి . ఏప్రిల్  మాసపు  అమ్మకాల  లో  వృద్ధి కనపరచటం  తో    MNM  1 % , EICHER 3 %  మేరకు  లాభపడ్డాయి.

మ్యూచువల్  ఫండ్  బిజినెస్స్  లో   అరంగేట్రం  చేయనున్నట్లు   ప్రకటించటం  తో   BAJAJ FINANCE సర్వీసెస్ 18%  ఎగబాకింది . కాగా   ధరలు  పెంచినందుకు  గాను   APOLLO TYRES  సుమారు   5 %  లాభపడింది. ఐతే    PROCUREMENT GUIDELINES  ని  ఉల్లంఘించినందుకు    VIDEOCON  ని  ప్రపంచ  బ్యాంక్   3 సంవత్సరాలు  నిషేదించటం  తో  ఈ కౌంటర్   3. 5 %  నష్టపోయింది .   చెక్కర  ధరలు   తగ్గుతున్నందున  నేడు  షుగర్ స్టాకులు   నష్టాలను  చవి చూసాయి.


సెన్సెక్స్  స్టాకు ల లో JAIPRAKASH  4.67 % ,STERLITE IND 3.28 %  నష్ట పోయి  మార్కెట్లను  బలహీన పరిచాయి.  కాగా    BHARTI AIRTEL  2.66% , WIPRO 1.7 %  లాభపడ్డాయి .

  •