- THE FOLLOWING IS A SAMPLE OF OUR REPORT. PLEASE VISIT http://www.telugustockmarket.com/ FOR TODAYS MARKET UPDATE !
- 06-05-2010
- మార్కెట్ నాడి
కర్ణుడి చావుకి అనేక కారణాలు అన్నది ఇదివరకటి మాట. ఈ మాటని మార్కెట్ల కు, మదుపరుల కు నేటి ట్రేడింగ్ కొరకు కూడా అన్వయించు కోవచ్చు. గ్రీస్ దేశం లో నెలకొని ఉన్న సంక్షోభం ఇతర ఐరోపా దేశాలకి అంటు వ్యాధి లాగా సోకే ప్రమాదమున్నదని అంచనాలు వెలవడుతున్నాయి. ఇది జరిగితే యూరో కరెన్సీ పై విశ్వాసం పూర్తి గా దెబ్బ తినే ప్రమాదమున్నదని, తద్వారా మరిన్ని జటిలమైన సమస్యలు ఏర్పడ తాయన్న భయాందోళ తో అమెరికా మార్కెట్లు నిన్న ఆద్యంతం నష్టాల లో కూరుకు పోయాయి. సెంటిమెంట్ పూర్తి గా BEARISH ఉన్నదని అమెరికా మార్కెట్ల లో ని పెక్కు రెటింగ్ ఏజన్సీ లు కూడా వ్యాఖ్యానించాయి.
నేడు దీర్ఘ కాల సెలవుల తరువాత జాపాన్ మార్కెట్లు పునః ప్రారంభం అయ్యాయి. గడిచిన ఐదు రోజుల ప్రపంచ మార్కెట్ల తీరు తెన్నుల కి అనుసంధానం గా నేడు జాపాన్ మార్కెట్లు తీవ్రం గా నష్ట పోతున్నాయి.నేడు ఆసియా మార్కెట్లన్నీ కూడా 2010 సంవత్సరం లో ఇప్పటివరకు గడించిన లాభాలన్నీ విసర్జించటం గమనార్హం
మన మార్కెట్ల పరం గా యోచిస్తే, నేడు ఆహార ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ నేపధ్యం లో HSBC తెలియపరచిన అంచనాల ప్రకారం పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రస్తుతం భారత్ స్టాకుల ను అత్యంత ప్రతికూలం గా ప్రభావితం చేయనున్నదని , చైనా మార్కెట్ల తో పోలిస్తే భారత్ స్టాకు లే ప్రియం గా ఉన్నాయని , మునుముందు చైనా మార్కెట్లు ఆసియా మార్కెట్ల అభివృద్ధి కి అనుగుణం గా పెరగనున్నదని, కాని భారత్ మార్కెట్లు మాత్రం ఆసియా దేశాల తో సమ ఉజ్జీ గా ఇక పై ముందుకు దూసుకు పోజాలవని అంచనా వేసింది. ఈ అంశం మన మార్కెట్ల సెంటిమెంట్ ని మరింత గా దెబ్బ తీసే అవకాశం ఉంది. కాగా ప్రధాని మన్ మోహన్ సింగ్ , ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థల కు రూ. 14000 కోట్ల సబ్సిడీ ని ఇవ్వనున్నట్లు ప్రకటించటం తో నేడు ఈ రంగానికి చెందిన స్టాకులు లాభపడే అవకాశం ఉంది.
అదే విధం గా , ఆసియా మార్కెట్ల లో నే వినియోగ దారుల విశ్వాసం పెరుగుతున్నదని ,ఇది శుభ పరిణామమని తాజా గణాంకాలు వెల్లడి చేస్తున్నాయి . ఈ అంశం కూడా మార్కెట్ సెంటిమెంట్ ని నిలబెట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉంది.
ఐనప్పటికీ , విదేశీ మదుపరులు మన మార్కెట్ల లో నేడు కూడా అమ్మకాలు కొనసాగించే అవకాశాలు ఉన్నందున , నేడు కూడా మన మార్కెట్లు గత రెండు రోజుల నష్టాల పరం పర ను కొనసాగించ నున్నాయి.
అదే విధం గా , ఆసియా మార్కెట్ల లో నే వినియోగ దారుల విశ్వాసం పెరుగుతున్నదని ,ఇది శుభ పరిణామమని తాజా గణాంకాలు వెల్లడి చేస్తున్నాయి . ఈ అంశం కూడా మార్కెట్ సెంటిమెంట్ ని నిలబెట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉంది.
ఐనప్పటికీ , విదేశీ మదుపరులు మన మార్కెట్ల లో నేడు కూడా అమ్మకాలు కొనసాగించే అవకాశాలు ఉన్నందున , నేడు కూడా మన మార్కెట్లు గత రెండు రోజుల నష్టాల పరం పర ను కొనసాగించ నున్నాయి.
గత ముగింపు:: 17088
అవరోధాలు :17131-17221-17336-17440
- మద్దత్తు స్థాయిలు : 17051-16964-16777-16635-16508