- 05-05-2010
- మార్కెట్ నాడి
గ్రీస్ సంక్షోభం క్రమంగా ఇతర ఐరోపా దేశాలకి కూడా పాకే ప్రమాదమున్నదన్న అంచనాల తో అమెరికా మార్కెట్లు ఫెబ్రవరి తదుపరి అత్యంత కనిష్ట స్థాయికి కోల్పోయాయి. గ్రీస్ తరహా సంక్షోభం స్పైన్ వంటి పెద్ద దేశాల లో చోటు చేసుకుంటే మరింత ప్రమాదమని విశ్లేషకులు అంచనా వేయటం తో అమెరికా మార్కెట్లు ఆద్యంతం నష్టపోయాయి. పెద్ద దేశాలకు గ్రీస్ తరహా సహాయం అందించటం సాధ్యం కాదని వాదనలు వెలవడటం తో అమెరికా మార్కెట్ల సెంటిమెంట్ పూర్తి గా దెబ్బ తిన్నది .
గ్రీస్ దేశానికి IMF 110 బిలియెన్ యూరో ల సహాయం అందించిన విషయం తెలిసినదే .
గ్రీస్ ప్రభావం నేడు ఆసియా మార్కెట్ల పై కూడా తీవ్ర స్థాయి లో కనపడుతున్నది. పైగా ఆస్ట్రేలియా లో మైనింగ్ కంపనీల లాభాల లో 40 % వాటా ని ప్రభుత్వం అడగటం తో మైనింగ్ కంపనీలు కుదేలు మంటున్నాయి.
నేటి మన మార్కెట్లు ప్రస్థితి ని ప్రస్తావిస్తే, ప్రభుత్వం చెక్కర లైసెన్సింగ్ విధానం లో కీలక మార్పుల తో పాటు ధరల నియంత్రణ ని ఎత్తివేసే యోచన చేస్తునట్లు తెలుస్తోంది, ఈ సంవత్సరం చెక్కర దిగుబడి ఆశాజనకం గా ఉండగలదన్న అంచనాల తో ప్రభుత్వం చెక్కర ధరల నియంత్రణ ని ఎత్తి వేయవచ్చన్న వాదన కి ఊతం లభిస్తున్నది. ఈ అంశం షుగర్ స్టాకులు, ముఖ్యం గా క్రమ పద్ధతి లో నడిపిస్తున్న అగ్రగామి కంపనీల కి లాభదాయకం.
ఐతే నేడు ప్రపంచ మార్కెట్లన్నీ అతలాకుతలం అవుతున్నందున నేడు మన మార్కెట్లు కూడా తీవ్ర స్థాయిలో నష్టం ఎదురుకునే ప్రమాదం ఉంది. నిఫ్టీ 5050 పాయింట్ల కీలక మద్దత్తు పై ట్రేడర్లు ప్రత్యేక దృష్తి సారించ గలరు. ఈ మద్దత్తు కోల్పోతే మార్కెట్ల లో భారి దిద్దుబాటు చోటుచేసుకునే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు. కాబట్టి మదుపరులు నేటి ట్రేడింగ్ లో కొనుగోళ్ళ కి దూరం గా ఉండటం మంచిది .
భల్లూకాలు ( bears ) నేడు తమ పంజా దెబ్బ మార్కెట్ల కు రుచి చూపించ నున్నాయి.
భల్లూకాలు ( bears ) నేడు తమ పంజా దెబ్బ మార్కెట్ల కు రుచి చూపించ నున్నాయి.
నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు:: 17137
- అవరోధాలు :17440-17336- 17221
- మద్దత్తు స్థాయిలు : 17051-16964-16777-16635-16508