- 4-5-2010
- మార్కెట్ నాడి
ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ బఫ్ఫెట్ , గోల్డ్ మాన్ సాచ్ పట్ల పూర్తి విశ్వాసం ఉన్నదని ప్రకటించటం తో అమెరికా మార్కెట్లు భారి గా లాభపడ్డాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు కేవలం బ్యాంకుల నే తప్పు పట్టటం సబబు కాదని ప్రకటించటం తో అమెరికా మార్కెట్లు లాభపడ్డాయి.అదే విధం గా అయిర్ లైన్స్ విలీనాలు కూడా అమెరికా మార్కెట్లను బలోపేతం చేసాయి. ఐతే నేటి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా పయనిస్తున్నాయి. చైనా లో పెపుల్స్ బ్యాంకు CRR రేటు పెంచటం తో అక్కడి బ్యాంకింగ్ స్టాకులు కుఎలు మంటున్నాయి.
మన దేశం లో చోటు చేసుకున్న ని కీలక అంశాలను గమనిస్తే నిన్న లోక్ సభ లో విదేశీ యూనివెర్సిటి బిల్లు ని ప్రవేశ పెట్టటం తో విద్యా వ్యవస్థ లో నూతన అధ్యాయం ప్రారంభమయ్యింది. ఈ అంశం వలన education రంగాలకి చెందిన స్టాకుల లో కొనుగోళ్ళు కనిపించే అవకాశం ఉంది. ఈ బిల్లు సజావుగా ఆమోద ముద్ర పొందితే, నుక్లియర్ బిల్లు ని కూడా ప్రవేశ పెట్టె అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్లు రానున్న రోజుల లో AREVA . BHEL ,NTPC మున్నగు స్టాకుల పట్ల కూడా ఆసక్తి కనపరిచే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా, నిన్న విడుదల ఐన HSBC PMI గణాంకాలు వృద్ధి రేటు లో స్వల్ప తగ్గుదల సూచించింది. ఉత్పత్తి సామర్ధ్యం ని ప్రతిబింబించే ఈ గణాంకాలు వరుసగా రెండవ నెల వృద్ధి లో క్షీణత నమోదు చేయటం తో ఉత్పత్తి కి సంబంధించిన ఆర్డర్లు తగ్గుముఖం పడుతున్నాయని అంచనా వేయవచ్చు. ఈ అంశం నేటి మార్కేట్లని ప్రతికూలం గా ప్రభావితం చేయకపోయినా, ఊహించని ఇతర ప్రతికూల అంశాలు ఎదురైతే మార్కెట్లను బలహీనపరచవచ్చు. ముఖ్యం గా RIL - RNRL వివాదం పట్ల కోర్ట్ తీర్పు గురించి నిరీక్షిస్తున్న మార్కెట్లు అప్రమత్తం గా ట్రేడ్ అయ్యే సూచనలు ఉన్నాయి . కాబటి , నేడు మన మార్కెట్లు ఫ్లాట్ గా, స్వల్ప లాభాల తో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
నేటి సెన్సెక్స్ నకు కీలక మజిలీలు ఈ విధం గా ఉన్నాయి
- గత ముగింపు:: 17386
- అవరోధాలు :17464- 17530-17628
- మద్దతు స్థాయిలు :17329-17221-17189