04-05-2010
మార్కెట్ రిపోర్ట్
గ్రీస్ దేశానికి అందన సహాయం మూడు సంవత్సరాలకి సరిపోజాలదని గ్రీస్ ఆర్ధిక మంత్రి ప్రకటించటం, గ్రీస్ తో పాటు స్పైన్, పోర్చుగల్ దేశాలు కూడా ఆర్ధిక బలహీనత కి గురికాగాలవన్న అంచనాలు నేడు ఐరోపా మార్కేట్లని అతలాకుతలం చేసాయి. ఐరోపా మార్కెట్ల లో చోటు చేసుకున్న బలహీనత నేడు మన మార్కెట్లను మధ్యాన్నం తదుపరి భాల్లోకాల పంజాకి గురి చేసాయి. గంట ట్రేడింగ్ లో మెటల్స్ లో రంగం లో చోటు చేసుకున్న బలహీనత తో మార్కెట్లు భారి గా నష్టాలను చై చూసాయి. దీనితో బొంబాయి స్టాక్ మార్కెట్ సూచీ 249 సెన్సెక్స్ పాయింట్లు కోల్పోయి 17137 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 74 పాయింట్ల నష్టం తో 5148 పాయింట్ల వద్ద ముగిసింది.
సేక్టో రల్ సూ చీ ల లో నేడు అన్ని రంగాలు నష్టాలను నమోదు చేసాయి మెటల్స్ రంగం 3.93 % , రియాలిటి 2 .76 % అత్యధికం గా నష్టపోయాయి. .
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం, స్మాల్ క్యాప్ రంగం 1.75 శాతం చొప్పున నష్టపోయాయి. ప్రపంచ మార్కెట్ల లో కామోడిటి ల లో బేస్ మెటల్స్ ధరలు చైనా లో డిమాండ్ తగ్గవచ్చ్చన్న అంచనాలా తో ఆకస్మికం గా పడిపోవటం తో నేడు మెటల్స్ భారి గా కోల్పోయాయి. నాల్కో, హిందాల్కో, జిందాల్ స్టీల్, టాటా స్టీల్ , STERLITE, సేస గోవా మునంగు ప్రధాన మెటల్ స్టాకులు 2 % నుండి 6 % మేరకు నష్టపోయాయి. పైగా ఆర్ధిక శాఖా ప్రధాన సలహాదారుడు కౌశిక్ బాసు ఆహార ద్రవ్యోల్బణం క్రమంగా ఇతర రంగాల లో కి కూడా పాకుతున్నాయని తెలియచేయటం తో రియాలిటి రంగం కూడా నేడు భారి నష్టాలను చవి చూసింది. IB REAL ESTAE ( 5 % ), HDIL (4.5 % ) UNITECH (3.5 % ) PARSVANATH (3 % ) నష్ట పోయాయి.
నేడు బ్యాంకింగ్ దిగ్గజాలైన ICICI 2.5 % , AXIS 1.2 % , HDFC 1.5 % , SBI 0.82 % మేరకు నష్టపోయాయి.
TATA POWER, RELIANCE INFRA మధ్య చోటు చేసుకుంటున్న " power -war " నేపధ్యం లో ఈ స్టాకులు సుమారు 1.5 % నష్టపోయాయి. సానుకూల ఫలితాలు విడుదల చేయటం తో నేడు mirc electronics 22 % లాభపడింది . సెన్సెక్స్ సుమో వీరుడు రిలయన్స్ నేటి మార్కట్ బలహీనత ని తట్టుకోవటం తో సెన్సెక్స్ ఘోరంగా పడిపోకుండా అరికట్ట గలిగింది. రిలయన్స్ రేటింగ్ ని అంతర్జాతీయ సంస్థ FITCH పెంచటం తో ఈ కౌంటర్ కొద్దిమేరకు స్థిరం గా నిలబడ గలిగింది.
సెన్సెక్స్ స్టాకు ల నేడు HDFC 0.52 %, ,HERO HONDA 0.1 % మేరకు అతి స్వల్ప లాభాలను నమోదు చేయగా, HINDALCO 5.84 %, టాటా స్టీల్ 4.93 % నష్టపోయాయి