• 03-05-2010
  • మార్కెట్  రిపోర్ట్ 

ప్రతికూల  ప్రపంచ  మార్కెట్ల్  నేపధ్యం  లో  మేము   ఉదయం చర్చించిన  విధం గా   నష్టాల తో  ప్రారంభమైన మన  మార్కెట్లు  ఐరోపా మార్కెట్ల నుండి  ఎటువంటి  మద్దత్తు  లభించక  పోవటం  తో   ఆద్యంతం  నష్టాల లో  పయనించాయి.  దీనితో   బొంబాయి స్టాక్ మార్కెట్  సూచీ  సెన్సెక్స్  172 పాయింట్లు  కోల్పోయి   17386పాయింట్ల వద్ద  ముగియగా,   నిఫ్టీ 55 పాయింట్ల  నష్టాన్ని  మూటగట్టుకుని  5223 పాయింట్ల వద్ద  ముగిసింది. ఉదయం మా అంచనాలకి  అనుగుణం  గా చైనా   లో పీపుల్ బ్యాంక్  50 బేసిస్  పాయింట్ల  మేరకు    కీలక వడ్డీ రేటు ని  పెంచటం   మార్కెట్  బలహీనత  కి కారణమయ్యింది.   ఐరోపా  మార్కెట్ల  లో కూడా  గ్రీస్  ఉదంతం    ముగిసినప్పటికీ ,  ఇతర   దేశాలకి  కూడా  ఇదే గతి  పట్టవచ్చన్న   భయాందోళనలు  నెలకొనడం తో    బలహీనత  చోటు చేసుకుంది.  ఈ  ప్రభావం  వలన ఒక  దశ లో   సెన్సెక్స్ కనిష్టం  గా    17345   పాయింట్ల   వరకు  క్షీణించింది. ఐతే  మేము  దయం సూచించిన   17336  పాయింట్ల  మద్దత్తు  నిలబడటం  తో  మార్కెట్లు  స్వల్పం  గా పుంజుకున్నాయి.

నేటి  ట్రేడింగ్ లో  మిడ్ క్యాప్ రంగం  0.45 శాతం , స్మాల్ క్యాప్ రంగం 0.42 శాతం    చొప్పున  నష్ట పోయాయి. కాగా సేక్టో రల్  రంగాల లో  కన్సుమేర్ డ్యు రబుల్స్   మినహా  అన్ని రంగాలు  నష్ట పోయాయి. ఈ  రంగం   కేవలం 0.85 శాతం   లాభపడగా,  మెటల్స్   సూచీ నేడు  అత్యధికం  గా  1.95 %  నష్టపోయి సెన్సెక్స్  బలహీనతకి  కారణ మయ్యింది. క్యాపిటల్  గూడ్స్  సూచీ సైతం  నేడు   1.20 %  మేరకు  క్షీణించింది. 

స్టాకుల  వారిగా  చర్చిస్తే, నేడు  మేము అంచనా వేసినట్లు  ఆయిల్ మార్కెటింగ్   కంపనీలు  లాభాలను ఆర్జించాయి.   BPCL, HPCL, IOC   సుమారు  0.5 %  నుండి   3.5 %  మేరకు లాభపడ్డాయి. RIL- RNRL   వివాదం   పై సుప్రీం  కోర్ట్  తుది  తీర్పు  వెలవడవచ్చన్న అంచనాల తో  రిలయన్స్  0.87 %  నష్టపోయింది. ఏప్రిల్  మాసం  లో  TATA MOTORS  లో 52 %  అమ్మకాల వృద్ధి   సాధించటం  తో  సంవత్సరానికే  గరిష్ట ధర   ని  నమోదు  చేసి  చివరికి   2 %   కోల్పోయింది. Q 4  ఫలితాల  లో  26 %  వృద్ధి  ని నమోదు  చేసిన   HDFC    0.56 %  కోల్పోయింది.   కంపనీ    రూ. 36  డివిడెండ్  ప్రకటించి    1 : 5  నిష్పత్తి  లో  స్టాక్ స్ప్లిట్  ప్రకటించింది. 
ఫ్రాన్స్ కి చెందిన సనోఫిస్  అవెన్ టిస్ తో  ఒప్పందం  కుడుర్చుకోవటం  తో   GLENMARK  3.7 % ఎగాకింది.  JYOTI  141.5  కోట్ల  ఆర్డర్ ని  పొందటం  తో   5 %  పైకెగసింది . నికర  లాభం   లో   40 %  తగ్గుదల  సూచించటం  తో   MANGALAM CEMENT   4.7 %  నష్ట పోయింది


సెన్సెక్స్ స్తాకులను  పరిశీలిస్తే  , నేడు  హీరోహోండా  0.86 % , RCOM 0.24 %  స్వల్ప లాభాలను  నమోదు  చేసాయి . కాగా RELIANCE INFRA 3 % ,  HINDALCO  2.75%  నష్టపోయాయి .
  •