- 3-5-2010
- మార్కెట్ నాడి
గత శుక్రవారం అమెరికా మార్కెట్లు మరొక సారి చతికిల పడ్డాయి. అక్కడ విడుదల ఐన GDP గణాంకాలు వృద్ధి నమోదు చేసినప్పటికీ , GOLDMAN SACH పై క్రిమినల్ కేసు ని అమెరికా ప్రభుత్వం నమోదు చేయటం, గుల్ఫ్ ఆఫ్ మెక్సికో లో చమురు లీకేజిని అరికట్టలేక పోవటం మున్నగు కారణాలు అమెరికా మార్కెట్ల ను నష్టపరిచాయి.
నేడు ఆసియా మార్కెట్లు సైతం నష్టాల తో ప్రారంభమయ్యాయి. చైనా లో వృద్ధి ని, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే ప్రయత్నం లో భాగం గా కీలక వడ్డీ రేటుని అక్కడి సెంట్రల్ బ్యాంక్ పెంచే అవకాశం ఉందని చైనా మార్కెట్లు క్షీనిస్తున్నాయి. కాగా జపాన్ లో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, ప్రతి ద్రవ్యోల్బణం మున్నగు అంశాలు జపాన్ మార్కెట్లను బలహీన పరుస్తున్నాయి. సింగపూర్ మార్కెట్ల లో ట్రేడ్ అయ్యే నిఫ్టీ నేడు భారి గ్యాప్ డౌన్ తో ప్రారంభం కావటం మన మార్కెట్లకు అంత శుభకర మైన పరిణామం కాదని చెప్పుకోవచ్చు.
మన మార్కెట్ల పరం గా యోచిస్తే, గత శుక్రవారం ప్రధాని , చమురు ధరల నియంత్రణ ని తొలిగించే విధం గా కసరత్తు ప్రారంభించటం వలన నేటి ట్రేడింగ్ లో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థల వాటాల లో కొనుగోళ్ళు కనిపించే అవకాశం ఉంది. కాగా వచ్చే ఏడాది ప్రపంచ ప్రఖ్యాత WARREN BUFFET మన దేశం లో పర్యటించ నున్నట్లు ప్రకటించారు. భారత్ దేశం లో పెట్టుబడుల పట్ల ఆసక్తి కనపరుస్తున్నట్లు, ముఖ్యం గా ఇన్సురన్స్ రంగం లో పెట్టుబడి పెట్టె యోచన వున్నదని తెలియచేయటం మన మార్కెట్ సెంటిమెంట్ ని కొంత మెరుగు పరిచే అవకాశం ఉంది.
ప్రతికూల ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో మన మార్కెట్లు కూడా నేడు గ్యాప్ డౌన్ తో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐతే మధ్యాన్నం తదుపరి మన మార్కెట్లు ఐరోపా మార్కెట్ల ప్రభావం వలన కొంత పుంజుకునే ఆస్కారం లేకపోలేదు. గ్రీస్ దేశానికి ఋణం లభించటం , గ్రీస్ ప్రభుత్వం ఈ ఋణం లో కొంత భాగం అక్కడి బ్యాంకులను ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవటం మున్నగు అంశాలు మార్కెట్ సెంటిమెంట్ ని బలపరచ వచ్చు. అదే విధం గా మన మార్కెట్ల లో విడుదల కానున్న కంపనీల Q 4 గణాంకాలు కూడా మొత్తం మీద ఆశాజనకం గా ఉంటున్నాయి కాబట్టి ప్రారంభం లోని బలహీనతను మార్కెట్లు అధికమించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు:: 17558
- అవరోధాలు :17670- 17780-17830-
- మద్దతు స్థాయిలు :17530-17440-17336-17221