• 30-4-2010

  • మార్కెట్  రిపోర్ట్

సానుకూల   ప్రపంచ విపణుల   నేపధ్యం  లో    లాభాల  తో   ప్రారంభమైన  మార్కెట్లు  మధ్యాన్నం తదుపరి   అమ్మకాల  వత్తిడి  కి   గురి కావడం  తో  లాభాలను   కొంత  విసర్జించి  స్వల్ప  లాభాల తో  ముగిసాయి. బొంబాయి  స్టాక్  ఎక్స్చేంజ్   సూచీ  సెన్సెక్స్    55 పాయింట్ల   స్వల్ప  లాభం  తో  17558 పాయింట్ల  వద్ద  ముగిసింది.  కాగా   నిఫ్టీ  24  పాయింట్ల    లాభం  తో   5278  పాయింట్ల  వద్ద  ముగిసింది. 

నేటి  ట్రేడింగ్  లో    స్మాల్  క్యాప్ రంగం, మిడ్ క్యాప్ రంగం   0 .39 %,  1.0శాతం  చొప్పున  లాభపడ్డాయి. సేక్టరాల్  సూచీ ల లో  నేడు  మెటల్స్  రంగం  మినహా అన్ని రంగాలు  లాభపడ్డాయి.  మెటల్స్  సూచీ   0.41 %  నష్టాన్ని  నమోదు  చేసింది.  కాగా రియాలిటి   1.77 %  , ఆటో రంగం  1.51 % చొప్పున లాభపడ్డాయి.  
స్టాకుల  వారిగా  నేడు   హై  బీటా స్టాకులు   లాభపడి   సెన్సెక్స్ ని  నిలబెట్టాయి.   నేటి  ట్రేడింగ్  లో DLF,  HDIL, UNITECH, IBREALESTATE  1% నుండి  6.5 %    మేరకు   లాభపడ్డాయి.   గృహ  నిర్మాణ   రంగానికి  ఆర్ధిక  మంత్రి  రాయితీలు  ప్రకటించటం  తో   ఈ స్టాకులు   లాభపడ్డాయి. .    నేటి  ట్రేడింగ్  లో ఆటో  స్టాకు లు  కూడా   భారిగా లాభపడ్డాయి.  దక్షినాది  రాష్ట్రాల  లో  అమ్మకాలు  బాగా  పుంజుకోవటం  వలన  ASHOKLEYLAND   9.8 %  లాభపడింది.  కాగా   టాటా మోటర్స్  3.56 % ,TVS MOTORS  1.74 % ,HEROHONDA 3.4 5  చొప్పున   లాభాలను  నమోదు  చేసాయి.

చమురు  ధరల  పై  నియంత్రణ  ని   ఎత్తివేసేందుకు  గాను  ప్రధాన మంత్రి   మంత్రుల  వర్గాన్ని  ఏర్పరిచి  ఈ అంశం పై  పరిశీలించమని  సిఫారిషు  చేయటం  వలన  నేడు   ఆయిల్  మార్కటింగ్  కంపనీలైన   BPCL   55.30 % ,   HPCL 6.64 %IOC 7 %  మేరకు  ఎగబాకాయి.
బ్యాంకింగ్  రంగానికి  చెందిన   SBI  1% , ING VYSYA  , ANDHRA BANK 4 %  చొప్పున  లాభపడ్డాయి  .మెటల్స్  రంగం  లో  నేడు  SAIL 1.3 % , HINDALCO 1 % JSW STEEL    0.60 %  నష్టపోయాయి

నేటి  ట్రేడింగ్  లో  షుగర్  స్టాకుల  లో  మరల  తీపిదనం  సంతరించుకుంది.  .ఈ స్టాకులు  నేడు  భారిగా లాభపడ్డాయి.

సెన్సెక్స్ స్తాకులను  పరిశీలిస్తే  నేడు   TATA STEEL  2.24% , WIPRO 2.14 %  నష్టపోగా, హీరోహోండా   3.72 % , TATA MOTORS  3.56%  లాభపడ్డాయి.