• 8-4-2010
  • మార్కెట్ నాడి

నిరుత్సాహ పరిచే విధం గా కన్సుమేర్ క్రెడిట్ గణాంకాలు ఉండటం తో అమెరికా మార్కెట్లు గడించిన లాభాలను విసర్జించి గత రాత్రి ఫ్లాట్ గా ముగిసాయి .ఆసియా మార్కెట్ల లోకూడా నేడు లాభాల స్వీకరణ చోటు చేసుకోవటం తో మన మార్కెట్ల లో ని భల్లుకాలకి (bears కి ) నేడు ఆధిపత్యం దొరికే అవకాశం ఉంది. ఇండోనేసియా లో స్టాకు లు విదేశీ పెట్టుబడుల కారణం గా విపరీతంగా పెరిగి స్టాక్ బుడగ ఏర్పడిందని అధికారులు వెల్లడి చేయటం కొంత కలవర పరిచే అంశం . ఈ కారణం గా స్టాక్ మార్కెట్ల లో విదేశీ పెట్టుబడులను ఆ దేశం నియంత్రించే విధం గా చర్యలు చేపట్టనున్నది.

నిన్న ఇదే శీర్షిక లో చర్చించిన విధం గా గ్రీస్ దేశపు అప్పు ఎగవేత అవకాశాలు పెరగటం తో గ్రీస్ దేశపు పరిస్థతి ఇయిర్లాండ్ కంటే దయనీయం గా వున్నదని యూరో బలహీనపడటం కూడా నేడు ఆసియా మార్కెట్లను కృంగ దీస్తోంది. ఇక మన మార్కెట్ల పరంగా గా ఆలోచిస్తే, నేడు ఆహార ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అరికట్టే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ అధికారులు రిజర్వు బ్యాంక్ కి మరల సూచించటం తో రిజర్వు బ్యాంక్ ఏప్రిల్ 20 న జరప బోయే వడ్డీ రేటు సమీక్ష లో ఖచ్చితం గా కీలక వడ్డీ రేటు ని 100 బేసిస్ పాయింట్ల మేరకు పెంచే అవకాశం ఉంది. ఈ కారణం గా రియల్ ఎస్టేట్ , బ్యాంకింగ్ స్టాకులు కొంత వత్తిడి కి గురి అయ్యే అవకాశం లేకపోలేదు. పెరుగుతున్న రూపాయి విలువ కూడా ఎగుమతి దారులకు కొంత కష్టం కలిగించే అవకాశం ఉంది.

వరుస లాభాలను గడించిన మన మార్కెట్ల లో నేడు కొంత లాభాల స్వీకరణ జరగనున్నది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు:: 17970
  • మద్దత్తు స్థాయిలు : 17910-17780-17670
  • అవరోధాలు : 17990-18131-18245