- 07-04-2010
- మార్కెట్ రిపోర్ట్
నిన్నటి కథని పునరావృత్తం చేస్తూ , మధ్యాన్నం తదుపరి ఆటు పొట్ల కి గురి అయిన మన మార్కెట్లు చివరకి ఫ్లాట్ గా ముగిసాయి. దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ కేవలం 28 పాయింట్లు లాభపడి 17971 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 8 పాయింట్ల నష్టం తో 5375 పాయింట్ల వద్ద ముగిసింది. ఐతే నేటి ట్రేడింగ్ లో 18000 పాయింట్లను సెన్సెక్స్ తాకటం విశేషం. సెన్సెక్స్ నేడు గరిష్టం గా 18048 పాయింట్ల వరకు ఎగబాకి మదుపరుల లో ఆసక్తి రేపింది. ఐతే మధ్యాన్నం తదుపరి ఐరోపా మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యం లో మార్కెట్లు మరల కోల్పోయి ఫ్లాట్ గా ముగిసాయి. . నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.52 % లాభపడగా, స్మాల్ క్యాప్ రంగం 0.70 % ఎగబాకాయి. BSE సేక్టరాల్ సూచీ ల లో నేడు ఆటో రంగం అత్యధికం గా లాభపడింది. ఈ రంగం 1.10శాతం వృద్ధిని నమోదు చేసింది. కాగా చమురు మరియు గ్యాస్ రంగం 0.76 % లాభపడింది.నేడు బ్యాంకింగ్ రంగం అత్యధికం గా ౦.40 % నష్టాన్ని మూటగట్టుకొని మార్కెట్లు బలహీన పరిచాయి. కాగా మెటల్స్ రంగం లో కూడా లాభాల స్వీకరణ జరగటం తో 0.1% క్షీణించింది
రిలయన్స్ D6 బ్లాకు లో 21000 బ్యారెళ్ళ ముడి చమురు ఉత్పత్తి చేస్తున్నదన్న వార్త వలన నేడు చమురుస్టాకులు బలపడ్డాయి.RIL నేడు 0.7 % లాభపడింది. ఇండోనేసియా కి చెందిన PT MEGASARI MAKUMARI గ్రూపు ని కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించటం తో గోద్రెజ్ కన్సుమేర్ 3. 6 % ఎగబాకింది. ELECTOTHERM ప్రపంచం లోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ (స్మేల్టింగ్) ని ప్రవేశ పెట్ట నున్నదన్న వార్త తో ఈ కౌంటర్ 1.77 % ఎగబాకింది. శ్రీ అష్ట వినాయక సిని షేర్లను రూ. 21.60 చొప్పున తిరిగి కొనుగోలు చేయనున్నట్లు బోర్డుప్రకటించటం తో ఈ స్క్రిప్ట్ నేడు సుమారు 2.11 % లాభపడింది. 3 G వేలం తాలూకు అంచనాల తో నేడు IDEA 4.6% ఎగబాకింది . BLACKSTONE 250 మిలియన్ US డాలర్లను పెట్టుబడి పెట్టనున్న వార్త తో జాగరణ్ 11 % ఎగబాకింది
సెన్సెక్స్ స్టాకు ల లో నేడు HINDUSTAN UNI LEVER అత్యధికం గా 2.07 % నష్టపోగా ,సన్ ఫార్మ 1.62 % మేరకు కోల్పోయింది. కాగా గ్రాసిం 2.75 % టాటా మోటర్స్ 2.42 % లాభపడి మార్కెట్లను నిలబెట్టాయి.