-
08-04-2010
-
మార్కెట్ రిపోర్ట్
ఉదయం మేము సూచించిన విధం గా లాభాల స్వీకరణ జరిగి నేడు మన మార్కెట్లు గణనీయం గా క్షీణించాయి. గత రెండు రోజులు గా " మార్కెట్ నాడి " శీర్షిక లో చర్చిస్తున్న విధం గా గ్రీస్ దేశపు సంక్షోభం, ద్రవ్యోల్బణ అంశం మన మార్కెట్ల పై ప్రతికూల ప్రభావం చూపటం తో నేడు మన మార్కెట్లు నష్టపోయాయి. దీనితో బొంబాయి స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ 256 పాయింట్లు నష్ట పోగా , నిఫ్టీ 70 పాయింట్లు క్షీణించింది . ఒక దశ లో నిఫ్టీ 5300 పాయింట్ల కంటే దిగువ స్థాయిని పరిక్షించింది . సెన్సెక్స్ పరం గా మార్కెట్ 15696 పాయింట్ల వరకు పడిపోయింది. ఐతే మేము ఉదయం సూచించిన కీలక మద్దత్తు ఐన 15690 పాయింట్ల స్థాయి నిలబడటం తో చివరికి సెన్సెక్స్ 17714పాయింట్ల వద్ద, నిఫ్టీ 5304 పాయింట్ల వద్ద ముగిసాయి.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.40 శాతం , స్మాల్ క్యాప్ రంగం 0.38శాతం నష్ట పోయాయి. .
నేటి ట్రేడింగ్ లో ఐ.టి , రియాలిటి, కన్సుమేర్ డ్యుర బుల్స్ మినహా మిగిలిన అన్ని రంగాలు నష్టపోయాయి. ఈ రంగాలు మాత్రం 0.34 %, 0.55 % , 2.25 % చొప్పున లాభపడ్డాయి. చమురు మరియు గ్యాస్ అత్యధికం గా 1.88 % నష్టపోయింది కాగా మెటల్స్ రంగం 1.87 % మెరుగుని కోల్పోయింది .
నేడు విడుదల ఐన మార్చ్ 27 తాలూకు ఆహార ద్రవ్యోల్బణం 17.7 % ఎగబాకింది. గత వారం ఇది 16.35 % గా ఉండింది. పప్పుదినుసులు, పండ్లు, పాల ధరలు పెరగటం తో ద్రవ్యోల్బణం పెరిగిందని అధికార ప్రకటన తెలియ చేసింది. పెరగుతున్న ద్రవ్యోల్బణ నేపధ్యం లో రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేటు ని పెంచగలదన్న అంచనాల తో బ్యాంకింగ్ రంగానికి చెందిన స్టాకులు భారి గా నష్టపోయాయి. ICICI 2.65 % , HDFC 1.7 % SBI 0.86 % నష్టపోయాయి. మెటల్ స్టాకు ల లో నేడు హిందాల్కో 4.26 % నష్టపోయింది . కేంద్ర క్యాబినెట్ నేడు SAIL లో 20 % వాటాని రెండు విడతల లో అమ్మనున్నట్లు ప్రకటించటం తో ఈ స్టాకు అత్యధికం గా 7.5 % నష్టపోయింది. NALCO 1.8 % ,TATA STEEL 1.7 5 % మేరకు నష్టపోయాయి. పొగాకు లో విదేశీ పెట్టు బడులను ప్రభుత్వం నిరోధించటం తో నేడు ITC 0.68 % నష్టపోయింది. జాగరణ్ ప్రకాశాన్ MID DAY MULTIMEDIA తో ఒప్పందం కుదుర్చు కోవచ్చన్న అంచనాల తో ఈ కౌంటర్ 8 % నష్టపోయింది. చైనా కరెన్సీ మారక విలువ మార్చే అవకాశం ఉన్నదన్న అంచనాల తో నేడు ఐ. టి స్టాకులు బలపడ్డాయి. US FDA ఆమోదం లభించటం తో TORRENT PHARMA 0.19 % లాభపడింది . FORTIFY INFRA ని కొనుగోలు చేయటం తో MPHASIS 2.73 % బలపడింది
సెన్సెక్స్ స్టాకు ల లో నేడు HINDALCO 4.29 % , HDFC 2.56 % అత్యధికం గా నష్టాలను నమోదు చేసి సెన్సెక్స్ పతనానికి కారణమయ్యాయి. కాగా INFOSYS 0.52 % ,DLF 0.48 % లాభపడి బుల్ల్స్ పక్షాన నిలిచాయి.
-
.