• 30-4-2010
  •  మార్కెట్  నాడి

గ్రీస్   ప్రధాని  పాపంద్రియో   బడ్జెట్  లోటు   ని  తగ్గించే  విధం గా   పలు  చర్యలు తీసుకోవటం  తో      జర్మనీ  , ఫ్రాన్సు  ,   అంతర్జాతీయ   ద్రవ్య  నిధి  - గ్రీస్   దేశానికి   సహాయం అందించేందుకు  గ్రీన్ సిగ్నల్  ఇచ్చాయి. దీనితో    ప్రపంచ  మార్కెట్ల   లో  సానుకూలా  వాతావరణం   ఏర్పడటం  తో   గత  రాత్రి  అమరికా  మార్కెట్లు   బలం గా ముగిసాయి .  మోటోరోల , స్టార్ వుడ్    మున్నగు    ప్రముఖ  కంపనీలు  సానుకూల  ఫలితాలు   వెల్లడి చేయటం  తో   అమెరికా  మార్కెట్లు   లాభాల తో  ముగిసాయి.గత   రాత్రి     అక్కడి  మార్కెట్ల  లో    భారత దేశపు  ADR  ల  లో  PATNI  COMPUTERS   మినహా   మిగిలినవన్నీ  కూడా   భారి   లాభాలను  ఆర్జించటం  విశేషం . 

  నేటి   ఆసియా  మార్కెట్లు  కూడా    లాభాల తో    శుభారంభం  చేసాయి. గత  నాలుగు  రోజులు గా    అతలా కుతలం అయిన  ఆసియా   మార్కెట్ల  లో నేడు   చౌక  బేర సారాలు    కొనసాగుతున్నాయి.  పైగా  అమెరికా  డాలర్  బలపడటం  కూడా  ఆసియా  మార్కెట్ల కి   కలిసొచ్చింది.



 మన  మార్కెట్ల  పరం గా  యోచిస్తే  ,ఆహారా ద్రవ్యోల్బణం    తగ్గుముఖం  పడుతున్నప్పటికీ,  చమురు  ధరలు  ఎగబాకి  ద్రవ్యోల్బనాని  మరింత  పెంచే  అవకాశం  ఉండటం తో   ఈ  సమస్య   ని  అధికమించేందుకు   రిజర్వు బ్యాంక్   కీలక వడ్డీ రేటు  ని  మరొక సారి  పెంచే అవకాశం  ఉందని మార్కెట్లు   అంచనా వేసాయి.   ఐతే   రిజర్వు బ్యాంక్  మాత్రం  ఇప్పట్లో  పెంచేది లేదని  స్పష్టం  చేయటం  తో  ప్రస్తుతానికి   మార్కెట్లు  సానుకూలం  గా  స్పందించా నున్నాయి.   ఐతే   s & p  సంస్థ  మాత్రం   రిజర్వు బ్యాంక్  అంచాన  వేసినట్టు     2011  సంవత్సరానికి  ద్రవ్యోల్బణం 5.5 %  కి  తగ్గుముఖం  పట్టటం  అసాధ్యమని ,  భారత   దేశం  లో  ద్రవ్యోల్బణం   ఆశించిన  మేరకు    తగ్గాలంటే  మరిన్ని  సంవత్సరాలు   పట్టవచ్చని   ప్రకటించటం  వలన  మార్కెట్లు  కొంత  అయోమయ  పరిస్థితి  ని  ఎదురుకోనున్నాయి.   కాగా   నిన్న  పార్లమెంట్  లో   ఫై నాన్స్  బిల్లు  ఆమోదం  పొందటం   తో  మార్కెట్ల  కి  ఈ  సంవత్సరం   రంగాల  వారిగా స్పష్టత   ఏర్పడింది.  తాజా గా  ఆర్ధిక  మంత్రి   బిల్లు  లో   ఇన్ఫ్రా  రంగానికి  చెందిన   పరికరాలను దిగుమతి  కై  పన్ను  సడలింపు,    100 పడకల పై వున్న నూతన   హాస్పటల్  నిర్మాణాల   పై  పన్ను  రద్దు , విమాన  ప్రయానికుల పై  సర్వీసు  టాక్స్  తగ్గింపు  మున్నగు  అంశాలు  మార్కెట్లు  స్వాగతించ నున్నాయి.  
ఈ  కారణం  గా ఆయా  రంగాల  లో  స్టాకు ల వారిగా కొంత  కొనుగోళ్ళు  , నేటి  ట్రేడింగ్ లో చోటు చేసుకునే  అవకాశం  ఉంది.  
నేడు మన  మార్కెట్లు  ప్రపంచ మార్కెట్ల  కి  అనుసంధానం  గా  కొంత  పెరిగే అవకాశం  ఉంది. 
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు:: 17503
  • అవరోధాలు :17530-17670- 17780-17830-
  • మద్దతు స్థాయిలు :17440-17336-17221
    •  
  •