• 29-4-2010
  • మార్కెట్  రిపోర్ట్

ఏప్రిల్ తాలూకు  F & O  ముగింపు  సందర్భం గా   షార్ట్ కవేరింగ్  చోటు చేసుకోవటం ,  ఐరోపా మార్కెట్ల  లో కూడా పుల్ బ్యాక్  ర్యాలి  చోటు చేసుకోవటం మున్నగు  అంశాల  నేపధ్యం  లో నేడు మన మార్కెట్లు    లాభాల  తో  ముగిసాయి.  దీనితో   బొంబాయి  స్టాక్ మార్కెట్  సూచీ  సెన్సెక్స్ 123 పాయింట్ల   లాభం  తో  17503  పాయింట్ల  వద్ద  ముగియగా , నిఫ్టీ  39పాయింట్లు లాభపడి   5254 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి  ట్రేడింగ్  లో  షార్ట్  కవేరింగ్  నేపధ్యం  లో ఒక  దశ  లో  గరిష్టం  గా   17532  పాయింట్ల  వరకు  ఎగబాకిన   సెన్సెక్స్  , మేము  ఉదయం  సూచించిన  అవరోధమైన   17530   పాయింట్లను   చేదించ లేక పోయి  , చివరికి   17503  పాయింట్ల  వద్ద   0.71 %   వృద్ధిని  నమోదు  చేస్తూ  ముగిసింది. కాగా  నిఫ్టీ   0.74 %   లాభపడింది. 
నేడు  విడుదల  ఐన   ఏప్రిల్ 17తో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం  గణాంకాలు  వంద బేసిస్ పాయింట్ల నుండి 16.61 శాతానికి తగ్గుదల  నమోదు  చేయటం  కూడా  మార్కెట్  బలపడేందుకు   కారణమయ్యింది.  అదే ఏప్రిల్ 10తో ముగిసిన మునుపటి వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం 17.65 శాతంగా ఉండింది.


నేటి  ట్రేడింగ్  లో మిడ్ క్యాప్ రంగం 1.17 శాతం, స్మాల్ క్యాప్ రంగం 1.32  శాతం  చొప్పున లాభపడ్డాయి  సేక్టో రల్ సూచీ ల లో  నేడు  రియాలిటీ   రంగం  అత్యధికం గా  2.18 %  లాభపడింది .కాగా  కన్సుమర్  డ్యుర బుల్స్  రంగం 1.96 శాతం ఎగబాకింది. ఐతే   FMCG  1.11% ,ఐ .టి  రంగం  0.38 శాతం   చొప్పున   అత్యధికం గా నష్ట పోయాయి. 
స్టాకుల  వారిగా   విశేషాలను  గమనిస్తే , నేడు  ఇండేక్సేతర  బ్యాంకింగ్   స్టాకులు    భారిగా  లాభపడ్డాయి.   నేటి  ట్రేడింగ్  లో    ANDHRA BANK  5.25 % , UCO BANK 3.7 % ,DENA BANK 5.7 % , YES BANK  5.66 %   చొప్పున    లాభపడ్డాయి. LIC HOUSING  FINANCE  బ్యాంకింగ్   రంగం    లో  లైసెన్సు నకు  దరఖాస్తు చేయనున్న వార్త  వెలవడటం  తో  ఈ కౌంటర్  నేడు 4.32 %  ఎగబాకింది .  Q 4  లో నికర లాభం  లో    50 %  వృద్ధి  ని నమోదు  చేయటం  తో    EICHER MOTORS 16 %  భారి గా లాభపడింది.  మే  3   వ  తేది   న  బోర్డ్ మీటింగ్   సమావేశం  లో   స్టాక్ స్ప్లిట్  ఖరారు  చేయనున్న  వార్త  వలన   HDFC 0.72 %  లాభపడింది. కాగా  ROLTA  కంపనీ  పై  ఆదాయపు  పన్ను  శాఖ  దాడులు  నిర్వహిస్తున్నందున   ఈ  కౌంటర్   సుమారు   0.72 %  కోల్పోయింది.


సెన్సెక్స్  స్టాకు ల లో   ICICI BANK  2.86 % , TATA MOTORS  2. 61 % లాభపడగా , HINDUSTAN UNI LEVER  2.31 % , SUN PHARMA  2.25 %  నష్టపోయాయి.