• 29-4-2010

  • మార్కెట్  నాడి

నిన్నటి  ట్రేడింగ్  లో   గ్రీస్  పోర్చుగల్  దేశాలకి   రేటింగ్  తగ్గించిన   S & P సంస్థ  గత రాత్రి  తాజా గా   స్పెన్  దేశాన్ని  కూడా    డౌన్  గ్రేడ్  చేసి  రెటింగ్  ని తగ్గించటం  తో    ప్రపంచ వ్యాప్తం గా  మార్కెట్లు   విస్మయానికి  గురి అవుతున్నాయి.  ఐతే   గత రాత్రి  అమెరికా  మాత్రం  స్థానికం గా   , కంపనీలు   ఉత్తమ ఫలితాలు   ప్రకటించటం, అమెరికా   ఫెడరల్  రిజర్వు   వడ్డీ రేటు ని  ఇదే విధం గా  తక్కువ  రేటు కి  కొనసాగించాలని  నిర్ణ యించటం  తో ,   లేబర్  మార్కెట్  మెరుగు పడుతున్నదన్న  ప్రకటన  కారణం గా   అమెరికా మార్కెట్ల  లో  గత రాత్రి    చౌక బేర సారాలు   చోటు చేసుకుని  లాభపడ్డాయి. మొన్న  టి  ట్రేడింగ్  లో అమెరికా  మార్కెట్లు   భారిగా పతనమైన    సంగతి తెలిసినదే . 

  ఐతే  నేడు   ఆసియా  మార్కెట్లు  మాత్రం   తాజా  స్పెన్  షాక్   కి  గురి అవుతున్నాయి. గ్రీస్ దేశం లో నెలకొని ఉన్న సంక్షోభం  కేవలం   గ్రీస్  కే  పరిమితం   కాక  , పూర్తి  ఐరోపా   ప్రాంతాన్ని    అతలా కుతలం   చేసే అవకాశం  ఉందన్న  అంచనాలు  వెలవడటం  తో    జర్మనీ,  మరియు   IMF సమగ్ర ప్రణాళిక   ని  రూపొందించే  విధం గా   కసరత్తు  చేస్తున్నాయి.
ఈ  సమస్య ని  పరిష్కరించక పొతే,  ప్రభుత్వాలే  దివాలా  తీస్తాయని,  అప్పుడు  ఆ  పరిస్థితి  ని  అధికమించేందుకు   ప్రభుత్వాలు   కరెన్సీ ని  ముద్రిస్తాయని . తద్వారా ఐరోపా  ప్రాంతం  లో  ద్రవ్యోల్బణం గణనీయం గా పెరగగలదని  అంచనాలు  వ్యక్తమౌతున్నాయి.

మన  మార్కెట్ల  పరం గా   ఆలోచిస్తే,   నేడు   ఆహార  ద్రవ్యోల్బణ   గణాంకాలు  విడుదల కానున్నాయి. ఆహార  ద్రవ్యోల్బణం  క్రమేపి   తగ్గగలదని  ఆర్ధిక  మంత్రి  భరోసా ఇవ్వటం  ఈ సందర్భం లో గమనార్హం.   ఐతే  మర్కెట్లు  మాత్రం  నేడు    ఏప్రిల్  మాసపు  డెరివెటివ్స్   ముగింపు  పై  ప్రధానం గా  దృష్టి  సారించ నున్నాయి.   నేడు  మార్కెట్ల  గమనం  రోల్ ఓవర్ల  పై  ఆధార పడనున్నది.  ముఖ్యం గా  గత   రెండు  రోజుల   లో  ఏర్పడ్డ షార్ట్   పొజిషన్ లను   ట్రే డెర్ లు  కవర్  చేసుకునే ప్రయత్నం  చేయవచ్చు.  కాబట్టి   నేటి  మన మార్కెట్ల  లో    స్వల్ప   పుల్ బ్యాక్   ర్యాలి    కనిపించ వచ్చు .  గత నాలుగు రోజులు గా భారి  గా  క్షీణించిన  కొన్ని  స్టాకుల  లో  చౌక బెర సారాలు  చోటు చేసుకునే  అవకాశం  ఉంది.కంపనీలు  ఉత్తమ మైన   Q 4  ఫలితాలు  ప్రకటించటం,   ఋతుపవనాలు  10 రోజులు  ముందు గానే   భారత్  లో  ప్రవేశించ వచ్చని  వాతావరణ  శాఖ  ఆశాభావం వ్యక్తం చేయటం  మున్నగు  అంశాలు   సెంటిమెంట్  ని  బలోపేతం చేయనున్నాయి.  ఇక   భల్లుకాల  (BEARS )  పక్షం   ఆలోచిస్తే సుప్రీం కోర్ట్ లో   RIL- RNRL  వివాదాన్ని   పరిశీలిస్తున్న   న్యాయమూర్తి  శ్రీ  బాలకృష్ణ   మే నెల   11 వ  తేది న  పదవీ విరామం  చేయనున్న  నేపధ్యం  లో   ఈ  వివాదానికి అంత లోపే  తుది  నిర్ణయం వెల వడ వచ్చన్న  అంచనాల తో    RNRL  లాభపడుతున్నది.కాగా   రిలయన్స్ వాటలు  నష్టపోతున్నాయి. రిలయన్స్  లో  చోటు చేసుకుంటున్న   బలహీనత  కారణం గా   సెన్సెక్స్  కూడా  బలహీనత కి   లోనయ్యే  ఆస్కారం   ఉంది.
 
  ఏది అమైనప్పటికీ , నేడు  మన మార్కెట్లు   (   F & O   ముగింపు  సందర్భం గా  )  ప్రపంచ మార్కెట్ల   పోకడ కి అతీతం గా  ,  తనదైన  శైలి  లో  ట్రేడ్  అయ్యే సూచనలు ఉన్నాయి. 



    • గత ముగింపు:: 17380

    • అవరోధాలు :17464- 17530-17628
    • మద్దతు స్థాయిలు :17329-17221-17189
    •