28-4-2010
- మార్కెట్ రిపోర్ట్
గ్రీస్ దేశం లో చోటు చేసుకున్న సంక్షోభం ఇతర ఐరోపా దేశాలకు కూడా పాకవచ్చన్న అంచనాల తో నేటి ఆసియా మార్కెట్లు కుదేలు మన్నాయి. ఉదయం మేము చర్చించిన విధం గా మన మార్కెట్లు కూడా భారి గా కోల్పోవటం తో నేడు బొంబాయి స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ 311 పాయింట్ల నష్టం తో 17380 పాయింట్ల వద్ద ముగిసింది .కాగా నిఫ్టీ 93 పాయింట్లు కోల్పోయి 5300 మార్కు కి దిగువన 5215 పాయింట్ల వద్ద ముగిసింది.
ఉదయం నష్టాల తో ప్రారంభమైన మన మార్కెట్లు ఒక దశ లో FMCG , హెల్త్ కేర్ రంగాల లో కొనుగోళ్ళు కనిపించటం తో కొంత నిలకడ సాధించేందుకు ప్రయత్నించాయి. ఐతే సెన్సెక్స్ సుమో వీరుడు రిలయన్స్ ని బ్రోకింగ్ సంస్థలు డౌన్ గ్రేడ్ చేయటం తో మార్కెట్ల లో నష్టాల పరంపర ఊపందుకుంది. దీనితో సెన్సెక్స్ కనిష్టం గా 17444 పాయింట్ల వరకు పడిపోయింది. ఐతే మేము సూచించిన 17336 పాయింట్ల మద్దత్తు నిలబడటం తో , చివరికి 17380 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ రంగాలు సుమారు 2 % చొప్పున నష్టపోయాయి. సేక్టో రల్ సూచీ ల లో నేడు అన్ని రంగాలు భారి గా నష్టపోయాయి. ముఖ్యం గా రియాలిటి సూచీ 3.57 శాతం, చమురు మరియు గ్యాస్ రంగం 2.56శాతం చొప్పున క్షీణించి సెన్సెక్స్ వెన్ను విరిచాయి .
స్టాకుల పరం గా పరిశీలిస్తే , సుప్రీం కోర్ట్ లో నడుస్తున్న వివాదం త్వరలో పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయన్న అంచనాల తో RNRL 6.3 % లాభపడింది. కాగా రిలయన్స్ 4 % నష్టపోయింది . Q 4 ఫలితాలు మార్కెట్ అంచనాల కి తగినట్టు గా లేకపోవటం తో BHARTI AIRTEL 1.26 % నష్టపోయింది. కాగా అమెరికా టెలికాం దిగ్గజం AT & T , TECHMAHINDRA లోని తమ వాటాని LIC కి అమ్మటం తో TECHMAHINDRA 4.5 % క్షీణించింది. . లోహపు సూచీ లో ప్రధాన స్టాకు లైన NALCO , STERLITE INDUSTRIES , TATA STEEL , HINDALCO, HINDUSTAN ZINC 1- 4 % చొప్పున నష్టపోయాయి. ICICI 3 % , HDFC 0.57 % నష్టపోయి సెన్సెక్స్ ని బలహీన పరిచాయి.
మార్చ్ తాలూకు నికర లాభం లో 10 రెట్లు వృద్ధి ని నమోదు చేయటం తో JSW ENERGY 1.32 % లాభపడింది. మంచి ఫలితాలు అందించటం వలన EXIDE INDUSTRIES 0.86 % లాభపడి బుల్ల్స్ పక్షాన నిలిచింది.
సెన్సెక్స్ స్తాకులను పరిశీలిస్తే SUN PHARMA 1.52 % , SBI 0.89 % లాభం ఆర్జించగా , JAIPRAKASH 4.48 %, RELIANCE 4.16 % నష్టపోయి నేటి మార్కెట్ పతనం లో ప్రధాన పాత్ర పోషించాయి.