-
28-4-2010
-
మార్కెట్ నాడి
కొన్ని రోజులు గా ఈ శీర్షిక లో పలు మార్లు ప్రస్తావించిన గ్రీస్ సంక్షోభం మరో మలుపు తిరిగింది. గ్రీస్ , పోర్చుగల్ దేశాలు తమ కున్న పెట్టుబడి రేటింగ్ ని కోల్పోయాయి. గత రాత్రి S & P విడుదల చేసిన తాజా రేటింగ్ లో పెట్టుబడులకు గ్రీస్ దేశాన్ని " చెత్త " గా, పోర్చుగల్ దేశానికి "A - " రేటింగ్ తో సూచించింది . దీనితో మదుపర్ల లో భయాందోళన చోటు చేసుకోవటం వలన గత రాత్రి అమెరికా మార్కెట్లు ఫిబ్రవరి తరువాత అత్యంత భారి గా కోల్పోయాయి. చివరకి , అమెరికా లో బ్యాంకుల కార్య కలాపాల పై నియంత్రణ సాధించే దిశ గా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లు వీగిపోవటం కూడా మార్కెట్లను ఉత్సాహ పరచ లేక పోయింది. గ్రీస్ కి IMF సహాయాని నిలిపివేయాలని జర్మనీ వత్తిడి తేవటం కూడా మదుపరులను విస్మయ పరుస్తున్నది. యూరో ప్రాంతం లో జర్మనీ ఆర్థికం గా అత్యంత బలమైన దేశమన్న విషయం తెలిసినదే. గ్రీస్ కి సహాయం నిలిపివేయాలని జర్మనీ ప్రజలు కోరుకోవటం తో, జర్మనీ , గ్రీస్ కి బాసట గా నిలిచే అవకాశం లేకుండా పోయింది . వచ్చే నెల జర్మనీ లో సార్వత్రిక ఎన్నికలు ప్రకటించిన విషయం తెలిసినదే. ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకం గా , తమ పదవి ని పనం గా పెట్టి గ్రీస్ దేశానికి సహాయం అందించే సాహసం బహుశా జర్మనీ చాన్సిలర్ అన్జిల మెర్కెల్ చేయక పోవచ్చు. . ఇది ఇలా ఉండగా గ్రీస్ దేశం లో ప్రజానీకం , IMF , EURO దేశాల నుండి సహాయాన్ని నిరాకరించాలని , సహాయాని ఆమోదిస్తే, దేశం పూర్తిగా IMF చెప్పు చేతల లో కి పోగాలదని ప్రభుత్వం పై వత్తిడి తేవటం కూడా సమస్య ని జటిలం చేస్తున్నది. పోర్చుగల్ , తదుపరి ఐర్లాండ్ దేశాల లో కూడా ఆర్ధిక వ్యవస్థ చ్చిన్నా భిన్నం అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ కారణం గా మదుపరుల లో యూరో ప్రాంతపు మార్కెట్ల పట్ల పూర్తి గా విముఖత ఏర్పడటం తో మార్కెట్లు భారిగా క్షీణించాయి.
ఐరోపా లో చోటు చేసుకుంటున్న ఈ సంఘటనల వలన కరెన్సీ మార్కెట్ల లో యూరో క్షీణించి అమెరికా డాలర్ బలపడే అవకాశం ఉంది.
నేటి ఆసియా మార్కెట్ల లో కూడా గ్రీస్ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. నేడు అన్ని మార్కెట్లు భారి గ్యాప్ డౌన్ తో ప్రారంభం కావటం తో మార్కెట్ల లో అమ్మకాల వత్తిడి అధికం గా ఉంది.
కాగా మన దేశం పరిస్థితి ని అంచనా వేస్తే, నిన్న ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన CUT MOTION వీగిపోవటం తద్వారా రాజకీయ అస్తిరత్వం దూరం కావటం అనే అంశం మార్కెట్లకు లాభదాయకం. ఇప్పుడు బడ్జెట్ బిల్లు పై చర్చ కొనసాగగలదన్న అంచనాలు కూడా మార్కెట్ల కు లాభదాయకం .ఈ బడ్జెట్ బిల్లు లో ప్రభుత్వం COAL INDIA, HINDUSTAN COPPER, POWER GRID, EIL, INDIAN OIL మున్నగు కంపనీల వాటాలను అమ్మి బడ్జెట్ లోటు ని భర్తీ చేయాలన్న యోచన కి మార్గం సుగమం అయ్యింది.
కాగా మన దేశం పరిస్థితి ని అంచనా వేస్తే, నిన్న ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన CUT MOTION వీగిపోవటం తద్వారా రాజకీయ అస్తిరత్వం దూరం కావటం అనే అంశం మార్కెట్లకు లాభదాయకం. ఇప్పుడు బడ్జెట్ బిల్లు పై చర్చ కొనసాగగలదన్న అంచనాలు కూడా మార్కెట్ల కు లాభదాయకం .ఈ బడ్జెట్ బిల్లు లో ప్రభుత్వం COAL INDIA, HINDUSTAN COPPER, POWER GRID, EIL, INDIAN OIL మున్నగు కంపనీల వాటాలను అమ్మి బడ్జెట్ లోటు ని భర్తీ చేయాలన్న యోచన కి మార్గం సుగమం అయ్యింది.
ఈ సంవత్సరం ఋతు పవనాలు ఆశాజనకం గా ఉండగలవని మరొక సారి వాతావరణ శాఖ భరోసా ఇవ్వటం కూడా మార్కెట్లకు కలిసొచ్చే అంశం.
మార్చ్ నెలలో 6 కీలక పారిశ్రామిక రంగాల లో భారత్ 7.2 % వృద్ధిని సాధించిందని పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియపరచటం కూడా మార్కెట్లకు లాభదాయకం . పైగా కంపనీలు కూడా తమ Q4 ఫలితాలను ఆశాజనకం గా విడుదల చేయటం కూడా మార్కెట్ల్ సెంటిమెంట్ ని నిలబెట్టే ఆస్కారం ఉంది.
మన దేశం లో ని సానుకూల అంశాలు, ప్రపంచ మార్కట్ల లో ని అమ్మకాల వత్తిడి మున్నగు పరస్పర విరుద్ధ అంశాల నడుమ మన మార్కెట్లు నేడు అతలా కుతలం కానున్నాయి. పైగా రేపు F &O ముగింపు కనుక మార్కెట్ అన్ని విధాల వత్తిడికి గురి అవ్వ నున్నది. మదుపరులను ఉచ్చు లో బిగించేందుకు నేడు ఆపెరేటర్ల కు సదవకాశం . కాబట్టి నేటి ట్రేడింగ్ లో అనుభవం లేని వారు మార్కెట్లకు దూరం గా ఉండటమే మంచిది.
మొత్తం మీద , నేడు మార్కెట్ల లో భల్లూకాలు (BEARS ) వీరంగం సృస్తించ నున్నాయి.
-
నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
-
గత ముగింపు:: 17690 -
అవరోధాలు : 17780-17830 -
మద్దతు స్థాయిలు :17574-17440-17336-17221