• 27-4-2010

  • మార్కెట్  రిపోర్ట్ 

ప్రతికూల   ప్రపంచ మార్కెట్ల  నేపధ్యం లో నేడు మన మార్కెట్లు  కూడా బలహీనం గా  ట్రేడ్ అయ్యాయి . గురువారం   F & O  ముగింపు   ముందస్తు   పోర్ట్ ఫోలియో   లో  చోటు చేసుకునే   మార్పులు చేర్పుల  కారణం గా   నేడు   బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ  సెన్సెక్స్  55 పాయింట్ల  నష్టం  తో 17691 పాయింట్ల  వద్ద ముగిసింది. కాగా   నిఫ్టీ 14 పాయింట్ల  స్వల్ప నష్టం  తో  పాయింట్ల  వద్ద   5308 ముగిసింది.

నేటి  ట్రేడింగ్  లో హై  బీటా   స్టాకులు  ప్రధానం గా నష్టపోయినప్పటికీ  ,  స్మాల్ క్యాప్   స్టాకుల లో  అనువైన ఫలితాల   కారణం గా   కొనుగోళ్ళు  చోటుచేసుకోవటం  తో   సెన్సెక్స్  నష్టం  సీమితమయ్యింది . సెన్సెక్స్ స్టాకు ల లో 1610  స్టాకులు  నష్టపోగా,   1286 స్టాకులు లాభాలను  ఆర్జించాయి. 
నేటి  ట్రేడింగ్  లో మిడ్ క్యాప్ రంగం   0.31 % , స్మాల్  క్యాప్ రంగం  0.01 %  స్వల్ప నష్టాన్ని  నమోదు చేసాయి.  సేక్టో రల్  సూచీ ల లో నిన్నటి  తరహా నే  రియాలిటి  రంగం  అత్యధికం గా  1.44శాతం  కోల్పోగా,  లోహ పు   సూచీ  0.85 శాతం   కోల్పోయింది.   రక్షణాత్మక  రంగాలైన   FMCG ,  హెల్త్  కేర్  రంగాల  పట్ల  మదుపరులు  ఆసక్తి కనపరచటం  తో  ఈ రంగాలు   0.30 % , 0.57 %   చొప్పున  లాభపడ్డాయి. 

స్టాకుల  వారిగా నేడు  సెన్సెక్స్ ప్రాధాన  స్టాకుల లో  అమ్మకాల వత్తిడి   ప్రస్పుటం గా కనిపించింది.    RIL   0.81 % ,DLF 1.81 % ,JAIPRAKASH 3.74 % . BHEL 1.15 % MARUTI 4 % , GRASIM 1 %  , HERO HONDA 0. 5 % , TATA MOTORS  0. 5 % . SBI 1.6 % ICICI BANK  1.43 % , STERLITE INDUSTRIES   % ,TATA STEEL  % మేరకు   క్షీణించాయి. 
Q 4  ఫలితాలు  నిస్పృహ  కలిగించే  విధం గా ఉండటం  తో  PFC  1.64 %  నష్టపోయింది. రాగల  12 మాసాల లో    TIER -1,TIER -2  క్యాపిటల్  రూపం  లో   3500  కోట్లు  సమీకరించ నున్నట్లు  ప్రకటించటం  తో  IDFC 3 % నష్టపోయింది .  83  మిలియన్ల   టన్నుల చమురు  నిక్షీపాలను  తమ  ఖాతా లో  క్రూడికరించినట్లు  ప్రకటించటం  తో ONGC  2.86 %  లాభపడింది.   Q 3 ఫలితాల లో నికర  లాభం  లో  50 %   వృద్ధి  నమోదు  చేయటం  తో  GILLETTE  3.85 %  లాభపడింది. 


సెన్సెక్స్  స్టాకు ల లో  ONGC 2.86 % , REL INFRA 1.74 %  లాభపడగా , మారుతి  3. 88 % , జై ప్రకాష్   3.74 %  అత్యధికం గా నష్టపోయాయి.