• 27-4-2010
  • మార్కెట్  నాడి 

గత  రాత్రి  అమెరికా మార్కెట్లు   19  నెలల  గరిష్ట స్థాయినుండి  పడిపోయాయి.  నూతనం గా   బ్యాంకుల కార్య కలాపాల పై  కట్టడి   చేసే విధం గా  అమెరికా ప్రభుత్వం  బిల్లు ప్రవేశపెట్ట నున్నదన్న  వార్త  తో    వాల్  స్ట్రీట్   దెబ్బతిన్నది. కాగా నేడు  ఆసియా మార్కెట్ల లో కూడా  లాభాల  స్వీకరణ  చోటు చేసుకుంటున్నది. ముఖ్యం గా  చైనా మార్కెట్ల  లో  ప్రభుత్వం , రియల్ ఎస్టేట్   ధరలని  కట్టడి   చేస్తుండటం  తో  ఈ  ప్రభావం  ముడి  సరుకుల పై కూడా  పడవచ్చన్న  అంచనాల తో   మార్కెట్లు  నష్టపోతున్నాయి. ఐతే చైనా  లో  అసెట్  బుడగ ఏర్పడటం ఖాయం  అని,  ప్రస్తుతం  చైనా చేపడుతున్న   చర్యలు  అక్కడ రియల్ ఎస్టేట్  బుడగ ని ఆపజాలవని ప్రముఖ  హెడ్జ్ ఫండ్  మనేజేర్   జేమ్స్  చానోస్   జోస్యం చెప్పటం తో  మార్కెట్లు మరింత గా   బెంబేలెత్తి పోతున్నాయి.  ఇక  ఐరోపా  మార్కెట్ల  లో  గ్రీస్ తరువాత   పోర్చుగల్  సంక్షోభానికి సిద్ధమౌతున్న అంచనాలు కూడా   కించిత్ ఆందోళన  కలిగించే అంశం. గ్రీస్ దేశం  మరిన్ని  సంస్కరణలు  చేపడితే  తప్ప  పరిస్థతి   అదుపులోకి రాదనీ   జర్మనీ  అభిప్రాయం  తెలియపరచటం   కూడా  ఐరోపా మార్కెట్ల  సెంటిమెంట్ ని బలహీన పరిచే విధం గా ఉంది. 

మన మార్కెట్ల పరం గా  యోచిస్తే ,  ద్రవ్యోల్బణం  శృతి మించ నున్నదని,  పెరుగుతున్న  ద్రవ్యోల్బణాన్ని  తగ్గించే విధం గా మరిన్ని   చర్యలు  అవసరమని  రిజర్వు బ్యాంక్  గవర్నర్  తెలియపరచటం కూడా  మునుముందు   గడ్డుకాలం ఉండగలదని  సూచిస్తున్నది.  పెరుగుతున్న ద్రవ్యోల్బణం   పై  రాజకీయ  లబ్ది  గురించి   ఇప్పటికే  ప్రతిపక్ష   పార్టీలు నేడు  దేశవ్యాప్త  హర్తాల్   కి పిలుపునివ్వటం  తెలిసినదే.  ఈ  అంశాలు అటు ప్రభుత్వం ,ఇటు  రిజర్వు బ్యాంక్  పై  మరింత వత్తిడిని  పెంచనున్నాయి. పైగా  రాబోయే  గురువారం F & O  ముగింపు కావున  నేడు మార్కెట్ల లో  పెద్దగా  కొనుగోళ్ళు  కనిపించక పోవచ్చు. 
ప్రతికూల  ప్రపంచ  విపణుల  నేపధ్యం  లో  నేడు మన  మార్కెట్లు  కూడా  కొంత  లాభాల  స్వీకరణ కి  గురి అయ్యే  అవకాశం  ఉంది. ఐతే  కంపనీల  పరంగా  సానుకూల  ఫలితాలు  వెల్లడి  చేస్తున్నందున  స్టాకుల  వారిగా  కొంత  కొనుగోళ్ళు  కనిపించ వచ్చు.


  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :

  • గత ముగింపు:: 17745

  • అవరోధాలు : 17780-17830-17934

  • మద్దతు స్థాయిలు :17530-17440-17336