26-4-2010
మార్కెట్ రిపోర్ట్
మా అంచనాల కు అనుగుణం గా నేడు మార్కెట్లు నిలకడగా ట్రేడ్ అయ్యాయి. సానుకూల ఆసియా మార్కట్ల ప్రభావం, వాతావరణ శాఖ ఋతుపవనాల పై ఇచ్చిన భరోసా మార్కెట్లను స్థిరం గా పయనింప జేసాయి. దీనితో బొంబాయి స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ 51 పాయింట్ల లాభం తో 17745 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 18 పాయింట్ల స్వల్ప లాభం తో 5322 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.59 శాతం , స్మాల్ క్యాప్ రంగం 0.49 శాతం చొప్పున లాభాలను ఆర్జించాయి. కాగా సేక్టో రాళ్ సూచీ ల లో మెటల్స్ రంగం అత్యధికం గా 2.34 శాతం లాభపడటం విశేషం .కాగా పసు సూచీ కూడా 0.60 % మేరకు లాభపడింది. ఐతే రిలయన్స్ వాటా లో చోటు చేసుకున్న బలహీనత వలన చమురు మరియు గ్యాస్ రంగం 0.95 % నష్ట పోయింది. కాగా రియాలిటి రంగం అత్యధికం గా 1.63 % నష్టాలను చవి చూసింది.
స్టాకుల వారిగా పరిశీలిస్తే , నేడు విడుదల చేసిన ఫలితాల లో STERLITE INDUSTRIES అధ్బుతం గా రాణించటం తో ఈ కౌంటర్ ఏకం గా 6 శాతం ఎగబాకింది. ఈ కంపనీ తాలూకు Q4 ఫలితాల లో రెండింతలు వృద్ధి కనపరచటం విశేషం. కాగా హిండాల్కో శాతం, టాటా స్టీల్ శాతం మేరకు ఎగబాకాయి.
కాగా మారుతి హలితాలు అంచనాలకి అనుగుణం గా లేకపోవటం తో ఈ కౌంటర్ 2 % నష్టపోయింది. మనప్పురం 1:5 నిష్పత్తి లో స్టాక్ స్ప్లిట్ కి మే 4 వ తేది ఖారారు చేయటం తో ఈ కౌంటర్ 4.6 % ఎగబాకింది. ఢిల్లీ హై కోర్ట్ DABUR తో విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం తో FEMCARE 4.4 % లాభపడింది. కాగా US కోర్ట్ SUN PHAARMA ఉత్పత్తి చేస్తున్న ELOXCIN మందుని అమెరికా లో అమ్మేందుకు నిషేదించటం తో ఈ కౌంటర్ సుమారు 5 % నష్ట పోయింది. GMRINDUSTRIES లో 20 % వాటా ని కొనుగోలు చేయనున్న నేపధ్యం లో ఈ కౌంటర్ 5 శాతం బలపడింది
ఇక సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే , STERLITE INDUSTRIES 5.95 % , HDFC 3.95 % లాభపడగా SUN PHARMA 4.77 % , DLF 2.52 % చొప్పున నష్టాలను చవి చూసాయి.