• 26-4-2010
  • మార్కెట్  నాడి 


శుక్రవారం  అమెరికా  మార్కెట్లు  సానుకూల  గృహ  నిర్మాణ  గణాంకాల  నేపధ్యం  లో  లాభపడ్డాయి. ఈ  నెల  30 తేదిన   జరగబోయే  ఫెడ్   సమావేశం  లో కీలక  వడ్డీ రేటు ని  తగ్గించి  ఉంచే అవకాశం  ఉందన్న   అంచనాల తో   అమెరికా మార్కెట్లు  బలంగా ట్రేడ్ అయ్యాయి.  నేటి  ఆసియా  మార్కెట్లు  కూడా, చైనా  మినహా ,  లాభాల తో పయనిస్తున్నాయి. కీలక  కంపనీలు  సానుకూల  ఫలితాలు  వెల్లడి చేయటం  తో  జపాన్ మరియు  ఇతర  ఆసియా  మార్కెట్ల  లో  సెంటిమెంట్  బలపడుతున్నది.  చైనా  మార్కెట్ల  లో  రియల్  ఎస్టేట్   రంగం  పై  కట్టు దిట్టలు  అమలు చేయటం  తో   అక్కడి  మార్కెట్లు  బలహీనం గా   ఉన్నాయి. 
నేటి మన మార్కెట్ల ను  ప్రభావితం  చేసే   విశేషాలను  గమనిస్తే,   వాతావరణ  శాఖ   . ఈ  సంవత్సరం   ఋతు పవనాలు  సాధారణం గా  ఉండగలదని   అంచనాలు  వ్యక్తం  చేయటం  తో  ఆహార  ఉత్పత్తి  పై  వత్తిడి   తగ్గే అవకాశం  ఉంది.  ఈ  అంశం  మార్కెట్  ని బలపరచ నున్నది .  కాగా  సెబి   , IPO   లకు  సంబందించిన   నియమావళి  లో  పెనుమార్పులు చేయనున్నది.  ప్రస్తుతం  ఇన్సురన్సు  కంపనీలు , దేశీయ మరియు  విదేశీ  సంష్టాగత మదుపర్లు   IPO  లకు  అప్లై  చేసే సమయం  లో  కేవలం   25 %   అప్ ఫ్రంట్ మార్జిన్  చెల్లిస్తే  సరిపోయేది.  నూతన  నియమావళి  అనుగుణంగా  , 100 %  మార్జిన్  చెల్లించవలసి ఉంటుంది.  కాబట్టి    ఈ  నియమావళి అమలు  పరిచే లోగా,  మార్కెట్ల లో  IPO  ల  వెల్లువ  ఏర్పడవచ్చు. ఈ కారణం గా  సెకండరి  మార్కెట్ల నుండి  దానం  తరలి పోయే  అవకాశం ఉంది. ఈ అంశం  మార్కెట్ల పై  రానున్న రోజుల  లో మరింత వత్తిడి కలిగించ నున్నది.   శుక్రవారం విడుదల ఐన  RIL  ఫలితాలు కూడా  మార్కేట్లని  నిరాశ పరిచాయి కనుక  ఈ కౌంటర్  , తద్వారా  సెన్సెక్స్  కొంత  బలహీనత కి గురి అయ్యే సూచనలు లేకపోలేదు. ప్రభుత్వ రంగ బ్యాంకుల కు   15000 కోట్ల  రూపాయల  మేరకు  ప్రభుత్వం  అందజేయనున్నందున   ఈ  రంగం  లో ని వాటాలు  లాభపడే అవకాశం ఉంది

నేడు  మార్కెట్లు   CONSOLIDATE  అయ్యే  దిశగా పయనించే  ఆస్కారం  ఉంది . 


  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :

  • గత ముగింపు:: 17694

  • అవరోధాలు : 17780-17830-17934

  • మద్దతు స్థాయిలు :17530-17440-17336