• 23-4-2010
  • మార్కెట్ రిపోర్ట్

కంపనీల Q 4 ఫలితాలు సానుకూలం గా ఉండగాలవన్న అంచనాల తో నేడు మన మార్కెట్లు ఆద్యంతం లాభాల తో పయనించాయి. ఇతర ఆసియా మార్కెట్లు గ్రీస్ సంక్షోభం పై అప్రమత్త ధోరణి తో ట్రేడ్ అయినప్పటికీ మన మార్కెట్లు ఇందుకు భిన్నం గా లాభాలను ఆర్జించాయి. దీనితో సెన్సెక్స్ 120 పాయింట్ల లాభం తో 17694 పాయింట్ల వద్ద ముగిసింది.. నిఫ్టీ కూడా 34 పాయింట్ల లాభాలను ఆర్జించి 5304 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్ లో నిఫ్టీ 5300 పాయింట్ల పైన ముగియటం విశేషం

నేటి ట్రేడింగ్ ల మిడ్ క్యాప్ రంగం 0.30 % , స్మాల్ క్యాప్ రంగం 0.51 % చొప్పున లాభపడ్డాయి. కాగా సేక్టోరల్ సూచీ ల లో బ్యాంకింగ్ రంగం అత్యధికం గా 1.66 % లాభపడింది. కాగా క్యాపిటల్ గూడ్స్ రంగం 1.23 % లాభపడటం విశేషం. కాగా మెటల్స్ రంగం 0.77 %, కన్సుమేర్ డ్యురబుల్స్ రంగం 0.38 % మేరకు నష్టపోయాయి.

మదుపరులు ఆసక్తి తో ఎదురుచూస్తున రిలయన్స్ ఫలితాలు నేటి ట్రేడింగ్ ముగిసిన తరువాత విడుదల అయ్యాయి. ఈ త్రైమాసం లో 30 % వృద్ధి ని కనపరిచినప్పటికీ, రిఫైనింగ్ మార్జిన్ల లో అంచనాలకు తగ్గట్టు గా లేకపోవటం కించిత్ నిరాశ పరిచింది. ఈ త్రైమాసానికి నికర లాభం 4710 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత సంవత్సరం ఇదే సమయానికి 3627 కోట్ల రూపాయలు గా ఉండింది. ఐతే మార్కెట్లు మాత్రం కనీసం 5190 కోట్ల రూపాయలు గా ఉండగలదని అంచనాలు వేసి పప్పు లో కాలేసాయి. ఈ ప్రతికూల ప్రభావం సోమవారం ట్రేడింగ్ లో కనపడనున్నది. నేడు ICICI BANK, WIPRO కూడా తమ ఫలితాలను ప్రకటించాయి. ఈ కంపనీలు సానుకూల ఫలితాలు ప్రకటించినప్పటికీ మార్కెటు మిశ్రమంగా ప్రతిక్రియ ని కనపరచాయి.

సెన్సెక్స్ స్టాకు ల లో నేడు ICICI BANK అత్యధికం గా 3.37 % ఎగబాకింది. కాగా JAIPRAKASH ASSOCIATES 2.95 % లాభపడింది. కాగా ACC 1.80 % , BHARTI AIRTEL 1.65 % మేరకు క్షీణించాయి.