• 23-4-2010
  • మార్కెట్ నాడి

గత రాత్రి అమెరికా మార్కెట్ల లో గృహ అమ్మకాల గణాంకాలు సానుకూలం గా విడుదల కావటం , కంపనీల ఫలితాలు అంచనాల కి మించి ఉండటం మున్నగు అంశాలు అక్కడి మార్కెట్లను నష్టాల నుండి లాభాల వైపు పయనింప జేసాయి. ఐతే నేటి ఆసియా మార్కెట్లు మాత్రం గ్రీస్ సంక్షోభం పట్ల కొంత నిరుత్సాహ ధోరణి అవలంభిస్తున్నాయి. మూడి సంస్థ గ్రీస్ దేశపు అంతర్జాతీయ రెటింగ్ ని తగ్గించటం తో ఆసియా మార్కెట్లు మందకొడిగా సాగుతున్నాయి. కాగా గ్రీస్ దేశం యూరో దేశాల నుండి 11.3 బిలియెన్ డాలర్ల మేరకు అత్యవసర ఆర్ధిక సహాయం కోరింది. ఈ అంశాలు గ్రీస్ పరిస్థితి పరమ అధ్వాన్నం గా ఉందని సూచించటం ఆసియా మార్కెట్లను బెంబేలు పుట్టిస్తున్నది. గ్రీస్ కారణం గా కరెన్సీ మార్కెట్ల లో యూరో కరన్సి బలహీన పడుతున్నది.

మన మార్కెట్ల పరంగా యోచిస్తే , నేడు మన మార్కెట్లు కంపనీలు ప్రకటిస్తున్న Q4 ఫలితాల పై నే ప్రధానం గా దృష్టి సారించ నున్నాయి. ముఖ్యం గా RIL, WIPRO ఫలితాల పై మదుపరులు ఆసక్తి కనపరచ నున్నారు. నేడు సెన్సెక్స్ సుమో వీరుడు రిలయన్స్ తమ Q4 ఫలితాలను వెల్ల డించ నున్నది . ఈ ఫలితాలు సానుకూలం గా ఉండే అవకాశం ఉన్నందున ప్రస్తుతానికి మార్కెట్లు లాభాల తో పయనిచే అవకాశం ఉంది.ముఖ్యం గా ఐ. టి. , చమురు రంగానికి చెందిన స్టాకుల పై ఈ కంపనీల సానుకూల ప్రభావం కనపడే అవకాశం ఉంది. ఐతే గ్రీస్ దేశం లో సంక్షోభం నా నాటికి జటిలం కావటం వలన మార్కెట్లు ఎప్పుడైనా ఈ అంశాన్ని పరిగణన లో తీసుకుని దిద్దుబాటు కి నాంది పలికే అవకాశం ఉంది కనుక మదుపరులు అప్రమత్తం గా ఉండటం మంచిది. మధ్యాన్నం తదుపరి ఐరోపా మార్కెట్లు ప్రతికూలం గా మన మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. పైగా నేడు వారంతం కనుక ట్రేడర్లు కొంత లాభాల స్వీకరణ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నందున నేడు మార్కెట్లు లాభాల తో ప్రారంభామైనప్పటికీ , తదుపరి ఆటుపోట్ల కి గురి అయ్యే సూచనలు ఉన్నాయి.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు:: 17574
  • అవరోధాలు :17670- 17780-17830-
  • మద్దతు స్థాయిలు :17440-17336-17221