- 22-4-2010
- మార్కెట్ రిపోర్ట్
ప్రతికూల ఆసియా మార్కెట్ల నేపధ్యం లో బలహీనం గా మన మార్కెట్లు ప్రారంభమయినప్పటికీ, కంపనీ ల సానుకూల Q 4 ఫలితాలు, ముఖ్యం గా SBI , RELIANCE మున్నగు కంపనీల ఫలితాల అంచనాల తో మార్కెట్లు లాభపడ్డాయి. దీనితో సెన్సెక్స్ 101 పాయింట్ల లాభం తో 17574 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 24 పాయింట్ల వృద్ధి తో 5269 పాయింట్ల వద్ద ముగిసింది.
రేపు విడుదల కాననున్న రిలయన్స్ Q 4 ఫలితాలు సంతృప్తి కరం గా వుండ గలవన్న అంచనాల తో మార్కెట్లు లాభపడ్డాయి.కాగా రిజర్వు బ్యాంక్ , ఇతర బ్యాంకు ల కు 70 % కవరేజ్ నిష్పత్తి ని సాధించేందుకు సెప్టెంబర్ 2010 గడువు ను పెంచటం తో SBI భారిగా లాభపడ్డాయి. ఒక దశ లో మార్కెట్లు గరిష్టం గా 17778 పాయింట్ల గరిష్ట స్థాయి వరకు ఎగబాకాయి. ఇది మేము ఉదయం సూచించిన 17777 పాయింట్ల స్థాయి కి సరిగ్గా సరిపోవటం గమనార్హం. ఐతే నేడు విడుదల ఐన ద్రవ్యోల్బణ గణాంకాలు నిరుత్సాహ పరిచటం తో మార్కెట్లు తదుపరి కొంత బలహీన పడ్డాయి. ఏప్రిల్ 10తో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 17.65 శాతానికి చేరుకుంది. అదే అంతకు మునుపటి వారం ఏప్రిల్ 3తో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం 17.22 శాతంగా ఉండిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి.కూరగాయలు, పండ్ల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. అదే గత సంవత్సరం ఇదే కాలానికి ఆహార ద్రవ్యోల్బణం 8.16 శాతంగా ఉండింది. పైగా మార్కెట్ ముగింపు సమయానికి దుడుకుగా ప్రారంభమైన ఐరోపా మార్కెట్ల లో తిరిగి బలహీనత చోటు చేసుకోవటం తో మన మార్కెట్లు కూడా ఐరోపా మార్కెట్ల కి అనుసంధానం గా లాభాల స్వీకరణ కి గురి అయ్యాయి. ఐనప్పటికీ నేడు మార్కెట్లు గ్రీన్ మార్కు లో ముగిసాయి.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.7 శాతం నష్టపోగా , స్మాల్ క్యాప్ రంగం అంతే శాతం లాభపడింది. సేక్టోరల్ రంగాల లో నేడు చమురు మరియు గ్యాస్ రంగం అత్యధికం గా 1.25 % లాభపడగా , ఆటో రంగం 0.90 % ఎగబాకింది. కాగా మెటల్స్ 0.61 %, రియాలిటి 1.34 % చొప్పున నష్టపోయాయి.
సెన్సెక్స్ స్టాకు ల లో నేటి ట్రేడింగ్ లో SBI 5.58 %, TATA MOTORS 3.34% అత్యధికం గా ఎగబాకాయి. కాగా SUN PHARMA 2.13 % ,TATA STEEL 1.83 % నష్టపోయాయి.