- 22-4-2010
- మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిసాయి. ఐరోపా మార్కెట్ల బలహీనత అమెరికా మార్కెట్ల పై ప్రతికూల ప్రభావం కనపరచాగా, బోయింగ్, యాపిల్ మున్నగు కంపనీలు సానుకూల ఫలితాలు ప్రకటించటం తో అక్కడి మార్కెట్లు మిశ్రమంగా ముగిసాయి. ఐతే నేటి ఆసియా మార్కెట్లు మాత్రం లాభాల స్వీకరణ కి గురి అవుతున్నాయి. సింగ పూర్ లో విదేశీ ఫండ్లను , PE మరియు హెడ్జ్ ఫండ్లను క్రమబద్దికరించాలని అక్కడి ప్రభుత్వం చేస్తున్న యోచన పై మార్కెట్లు ప్రతిక్రియ కనపరుస్తున్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ఒబామా అమెరికా మార్కెట్ల పై , ముఖ్యం గా బ్యాంకుల వ్యవహారాల ను క్రమబద్దికరించే విధం గా కొత్త గా బిల్లు ని ప్రవేశపెట్టనున్న విషయం తెలిసినదే. ప్రజాధనాన్ని యధేచ్చ గా స్టాక్ మార్కెట్లను రక్షించేందుకు, ముఖ్యం గా బ్యాంకులను రక్షించేందుకు ఉపయోగించరాదని ఈ బిల్ సారాంశం. ఈ కారణం గా ఫ్యుచేర్స్ మార్కెట్ల లో బలహీనత చోటు చేసుకోవటం తో , నేడు ఆసియా లో ఈక్విటిలు కూడా దెబ్బతింటున్నాయి. ఇది ఇలా ఉండగా అంతర్జాతీయ ద్రవ్య నిధి ( IMF ) విడుదల చేసిన GDP పై నివేదిక కూడా అప్పు విస్పోటం ( DEBT EXPLOSION ) పై తీవ్ర స్థాయి లో చర్చింది. ఉద్దేపనల కారణం గా ప్రజాధనం పై వత్తిడి పెరుగుతున్నదని , మును ముందు ఈ సమస్య తీవ్ర తరం కాగలదని హెచ్చరించటం గమనార్హం . కాగా మన దేశం ఈ సంవత్సరం 8.5 % మేరకు వృద్ధి సాధించగలదని జోస్యం చెప్పింది. కాగా ఐరోపా లో విమాన సౌకర్యాలు కుదేలు మనటం తో గ్రీస్ కి అందాల్సిన సహాయం లో జాప్యం జరుగుతున్నందున , గ్రీస్ దేశం పై వత్తిడి పెరుగుతున్నది. ఈ కారణం గా ఐరోపా మార్కెట్ల లో నేడు బలహీనత కనపడే అవకాశం ఉంది.
మన మార్కెట్ల పరంగా యోచిస్తే, కంపనీలు Q4 ఫలితాలు సంతృప్తి కరం గా విడుదల చేస్తూ వుండటం తో ఇప్పటి వరకు మన మార్కెట్లు స్థిరం గా నే ఉన్నాయని చెప్పాలి. మన మార్కెట్లు నేడు ప్రధానం గా ద్రవ్యోల్బణ గణాంకాల పై దృష్టి సారించ నున్నాయి. ద్రవ్యోల్బణం లో వృద్ధి కనపడితే ,మదుపరులు క్రమంగా DEFENSIVE STOCKS వైపు మగ్గు చూపే అవకాశం ఉంది. అప్పుడు ఇతర స్టాకుల లో ముఖ్యం గా స్టీల్ , ఆటో స్టాకుల లో బలహీనత ఏర్పడే అవకాశం ఉంది.మధ్యానం తదుపరి ఐరోపా మార్కెట్ల గమనం మన మార్కెట్లకు కీలకం.
నేటి ఆసియా మార్కెట్ల లో ని బలహీనత కారణం గా మన మార్కెట్లు కొంత నష్టాల తో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నేటి ట్రేడింగ్ లో మార్కెట్లు ఆటు పోట్లు కి గురి అయ్యే సూచనలు ఉన్నాయి.
నేటి సెన్సెక్స్ నకు కీలక స్థాయిలు ఈ విధం గా ఉన్నాయి
- గత ముగింపు::17473
- అవరోధాలు : 17530-17628-17777
- మద్దతు స్థాయిలు :17460-17329-17221-17189