• 21-4-2010
  • మార్కెట్ రిపోర్ట్
సానుకూల ఆసియా మార్కెట్ల నేపధ్యం లో లాభాల తో ప్రారంభమైన మన మార్కెట్లు మధ్యాన్నం తదుపరి ఐరోపా మార్కెట్ల లోని బలహీనతల కారణం గా లాభాలను విసర్జించి ఫ్లాట్ గా ముగిసాయి. దీనితో బొంబాయి స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ కేవలం 12 పాయింట్ల లాభాన్ని నమోదు చేస్తూ 17472.5 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 14.8 పాయింట్ల లాభం తో 5245 పాయింట్ల వద్ద ఫ్లాట్ గా ముగిసింది . నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.96 శాతం, స్మాల్ క్యాప్ రంగం 1.38 శాతం చొప్పున లాభపడ్డాయి. సేక్టోరల్ సూచీ లో నేడు కూడా బ్యాంకింగ్ , రియాలిటి రంగాలు తమ జైత్ర యాత్ర ని కొనసాగించాయి. రంగాలు 1.25, 1.68 శాతం చొప్పున లాభపడ్డాయి.కాగా క్యాపిటల్ గూడ్స్ 0.57 % ,చమురు మరియు గ్యాస్ ఇండెక్స్ 0.41 % మేరకు క్షీణించాయి. స్టాకుల వారి విశేషాలు గమనిస్తే , Unitech యాజమాన్యం తమ బిజినెస్ లో కొన్ని అంశాలను ప్రతి విలీనం చేయనున్నట్లు ప్రకటించటం తో కౌంటర్ 2.46 % ఎగబాకింది. Q 4 లో తమ నికర లాభం లో 32 % వృద్ధి నమోదు చేయటం తో యాక్సిస్ బ్యాంక్ 4.4 % లాభపడింది . వ్యూహాత్మకం గా తమ వాటాల ని కొంత అమ్మకాలు జరిపి 335 కోట్ల రూపాయల మేరకు నిధులను సమకూర్చు కునే విధం గా కసరతు చేయటం తో SPICE JET 1.38 % వృద్ధి పొందింది. ప్రముఖ హిందీ టెలివిజన్ చానెల్ 9 X ని కొనుగోలు చేసినందుకు గాను ZEE ENTERTAINMENT 2.49 % ఎగబాకింది. QIP ద్వారా 80 కోట్ల రూపాయలను సమీకరించాలని బోర్డ్ ఆమోదం తెలపటం తో GSS AMERICA INFOTECH 4.46 % ఎగబాకింది. సెన్సెక్స్ స్టాకుల లో నేడు TATA MOTORS 2.17 %, HINDUSTAN UNILEVER 2.06 % మేరకు లాభపడ్డాయి. కాగా SUN PHARMA 2.87 % , BHEL 1.04 % నష్టపోయి మార్కెట్లను బలహీనపరచాయి.