• 21-4-2010
  • మార్కెట్ నాడి

నేడు ఆసియా మార్కెట్ల సూచీ ఐన MSCI ASIA PACIFIC ఇండెక్స్ భారి గా లాభపడటం తో నేడు ఆసియా మార్కెట్లు శుభారంభం చేసాయి. ఐతే చైనా కరన్సీ యువాన్ పై నియంత్రణ ని అక్కడి ప్రభుత్వం సడలించాలని ఇప్పుడు భారత్, బ్రజిల్ దేశాలు కూడా చైనా పై వత్తిడి తెస్తూ వుండటం తో చైనా మార్కెట్లు కొంత బలహీనం గా ట్రేడ్ అవుతున్నది. ఈ అంశం పట్ల గతం నుండే అమెరికా , చైనా పై వత్తిడి తెస్తున్న విషయం తెలిసినదే . గత రాత్రి అమెరికా మార్కెట్లు కూడా , GOLDMAN SACH గ్రూప్ యొక్క ఫలితాలు రెండింతలుగా విడుదల కావటం తో , లాభాల తో ముగిసాయి. సింగపూర్ లో ట్రేడ్ అవుతున్న నిఫ్టీ ఇండెక్స్ కూడా లాభాల తో ట్రేడ్ కావటం విశేషం.

మన మార్కెట్ల పరం గా యోచిస్తే నిన్న రిజర్వు బ్యాంక్ సమీక్ష లో కీలక వడ్డీ రేటు ని అతి తక్కువగా పెంచి మార్కెట్ల ని శాంత పరిచింది. ఐతే ఈ విధానం వలన ద్రవ్యోల్బణం ని కట్టడి చేసేందుకు మరికొంత కాలం పట్టవచ్చు. సానుకూల రిజర్వు బ్యాంక్ పరపతి విధానం వలన బ్యాంకింగ్ రంగం లో కొనుగోలు చేయదలచుకున్న మదుపరుల కు ఒక హెచ్చరిక - అంతర్జాతీయ ద్రవ్య నిధి ( IMF ) మునుముందు ఆర్ధిక వ్యవస్థ దివాలా తీస్తే తట్టుకునేందుకు గాను ప్రత్యెక నిధి ఏర్పరచ నున్నది. ఈ నిధి కి కావలసిన ద్రవ్యం కోసం బ్యాంకు ల పై కొత్త పన్ను లను విధించి సమీకరించాలని ఇప్పటికే G-20 దేశాలను సూచించింది. ఈ కారణం గా మదుపరులు ICICI BANK, HDFC ,ING VYSYA మున్నగు అంతర్జాతీయ బ్యాంకు ల జోలికి ఇప్పుడే వెళ్ళకుండా ఉండటం మంచిది.

సానుకూల ఆసియా మార్కెట్ల నేపధ్యం లో మన మార్కెట్లు నిన్నటి జోరు ని నేడు కూడా కొనసాగించే సూచనలు ఉన్నాయి.

  • గత ముగింపు::17460
  • అవరోధాలు :17464- 17530-17628
  • మద్దతు స్థాయిలు :17329-17221-17189