- 20-4-2010
- మార్కెట్ రిపోర్ట్
అంచనాలకి అనుగుణం గా నేడు రిజర్వు బ్యాంక్ రిపో, రివర్స్ రిపో వడ్డీ రేటు పై కేవలం 25 బేసిస్ పాయింట్లను మాత్రమె పెంచటం తో నిన్న భారి గా కోల్పోయిన మార్కెట్ల కు ఊరట కలిగింది. దీనితో బొంబాయి స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ 60 పాయింట్లు లాభపడి 17461 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది మేము ఉదయం సూచించిన 17464 పాయింట్ల అవరోధానికి అత్యంత సమీపం గా ఉండటం విశేషం. నేడు నిఫ్టీ 26 పాయింట్ల లాభం తో 5230 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం భారి లాభాల తో పయనించిన మార్కెట్ల లో మధ్యాన్నం తదుపరి ఐ .టి స్టాకు ల లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవటం తో కొంత క్షీణించి చివరికి స్వల్ప లాభాల తో ముగిసాయి .
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.39 శాతం, స్మాల్ క్యాప్ రంగం 1.58 శాతం లాభపడ్డాయి. సేక్టోరల్ సూచీ ల లో నేడు ఐ. టి ఇండెక్స్ అత్యధికం గా 1.28 శాతం నష్ట పోగా, టెక్ రంగం 1 శాతం బలహీనపడింది. కీలక వడ్డీ రేటు లో పెను మార్పులు లేకపోవటం తో బ్యాంకింగ్ , రియాలిటి రంగాలు 1.53, 3.08 శాతం చొప్పున లాభపడ్డాయి.
కమర్షియల్ రియాలిటి పై రిజర్వు బ్యాంక్ ఎటువంటి నియంత్రణలు కొత్తగా చేయకపోవటం తో నేడు OMAXE, IB REAL ESTATE , HDIL,PARSAVANATH DEVELOPERS, UNITECH, MAHINDRA LIE SPACE మున్నగు రియాలిటి స్టాకులు 1 % నుండి 5 % మేరకు లాభపడ్డాయి. బ్యాంకింగ్ స్టాకు లైన SBI 3.26 % , ICICI BANK 1.49 %, AXIS BANK 2.51 % లాభపడి రిజర్వు బ్యాంక్ నిర్యాణం పై సానుకూలం గా స్పందించాయి. ఇన్ఫ్రా రంగానికి చెందిన కంపనీల NON- SLR బాండ్లలో బ్యాంకులు పెట్టుబడి పెట్టవచ్చని రిజర్వు బ్యాంక్ స్పష్టం చేయటం తో GMR INFRA మరియు MAYATAS INFRA 7 %, NAGARJUNA CONSTRUCTION 6.28 % ఎగబాకాయి. వడ్డీ ఆధారిత ఆటో స్టాకులు కూడా నేడు ఎగబాకాయి. LG కంపనీ మొబైల్ ఫోన్లను తమిళనాడు లో విక్రయించేందుకు గాను డిస్ట్రిబ్యూటర్ గా నియామకం పొందటం తో REDINGTON INDIA 3 % లాభపడింది. అధ్బుత ఫలితాలు వెల్లడి చేయటం తో DEVELOPMENT CREDIT BANK 10% వృద్ధి చెందటం విశేషం.
సెన్సెక్స్ స్టాకు ల లో SBI 3.26 %, DLF 3.18 % అత్యధికం గా లాభపడగా , TCS 2. 74 %, HERO HONDA 2.39 % నష్టపోయాయి.