• 20-4-2010
  • మార్కెట్ నాడి
నేడు రిజర్వు బ్యాంక్ ఆర్ధిక పరపతి విధానం ప్రకటించ నున్నది. రిపో , రివెర్స్ రిపో పై వడ్డీ రేటు ని పెంచవచ్చని సర్వత్రా ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ, పెరుగుదల ఎంత మటుకు ఉండగలదని మార్కెట్లు నేడు ఉత్కంటం తో ఎదురు చూడనున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ని అరికట్టే విధానం లో భాగం గా రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేటు ని పెంచాలని యోచిస్తున్న విషయం తెలిసినదే. ఐతే కేంద్ర ప్రభుత్వం , వడ్డీ రేటు ని అతి తక్కువ మోతాదు లో పెంచాలని రిజర్వు బ్యాంక్ కి సూచన యిచ్చినట్లు తెలుస్తోంది. కారణం గా బహుశా రిజర్వు బ్యాంక్ 25 బేసిస్ పాయింట్ల మేరకు మాత్ర మే కీలక వడ్డీ రేటుని పెంచే అవకాశం ఉంది. ఇంత తక్కువ మోతాదు లో నే వడ్డన జరుగుతే మార్కెట్లు పెద్దగా ప్రతిక్రియ కనపరచక పోవచ్చు. ఇప్పటికే మార్కెట్లు 25 బేసిస్ పాయింట్ల మేరకు కీలక వడ్డీ రేటు ని పెంచవచ్చని డిస్కౌంట్ చేసాయి. కాబట్టి నేడు అనూహ్యం గా మార్కెట్లు పెరిగినా ఆశ్చర్యం లేదు. ముఖ్యం గా ప్రపంచ మార్కెట్ల లో చోటు చేసుకుంటున్న పరిణామాలు వాదన కి బలం చేకురుస్తోంది గత రాత్రి అమెరికా మార్కెట్లు ఆటు పొట్ల కి గురి అయ్యి లాభాల తో ముగిసాయి. GOLDMAN SACH పై దావా వేయటం పై అమెరికా సినేట్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వటం తో గ్రూపు పై దావా వేయటం అంత సులభం కాదని మార్కెట్లు అన్యయించటం తో అమెరికా మార్కెట్లు లాభపడ్డాయి. నిన్న భారి గా నష్టపోయిన ఆసియా మార్కెట్ల లో , అమెరికా లో చోటు చేసుకున్న పరిణామం కారణం గా తిరిగి పుంజుకుంటున్నాయి. కాగా ఐరోపా ప్రాంతం లో పౌర విమాన యానం తిరిగి పుంజుకునే అవకాశం మెరుగు పడుతుండటం తో డిమాండ్ పెరగ వచ్చన్న అంచనాల తో క్రూడ్ ఆయిల్ ధర అంతర్జాతీయ మార్కెట్ల లో బలపడుతున్నది. సానుకూల అంశాల నడుమ నేడు మన మార్కెట్లు నష్టాలను పక్కకి పెట్టి , ఫ్లాట్ గా , అప్రమత్త ధోరణి తో పయనించే అవకాశం ఉంది. నేడు రిజర్వు బ్యాంక్ ప్రకటన పైనే మార్కెట్ల గమనం ఆధార పడనున్నది. 50 బేసిస్ పాయింట్ల మేరకు వడ్డీ వృద్ధి ని మార్కెట్లు జీర్ణించుకునే అవకాశం ఉంది. అంత కంటే భారి గా కీలక వడ్డీ రేటు ని పెంచితే మాత్రం మరొక సారి మార్కెట్ల లో భల్లూకాలు తమ సత్తా చాటే అవకాశం ఉంది.
  • గత ముగింపు:: 17400
  • అవరోధాలు :17464- 17530-17628
  • మద్దతు స్థాయిలు :17329-17221-17189