- 19-4-2010
- మార్కెట్ రిపోర్ట్
బలహీనమైన ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో మా అంచనాలకి అనుగుణం గా నేడు మన మార్కెట్లు ఆద్యంతం నష్టాల తో పయనించాయి. రేపు రిజర్వు బ్యాంక్ వడ్డీ రేటు పై తీసుకో బోయే నిర్ణయం కూడా మార్కెట్లను బెంబెలత్తించటం తో బొంబాయి స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ 190.5 పాయింట్ల నష్టాన్ని మూట గట్టుకుని 17401పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 59 పాయింట్లు క్షీణించి 5203 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.03 శాతం, స్మాల్ క్యాప్ రంగం 1.50 శాతం నష్టపోయాయి. కాగా సేక్టోరల్ రంగాల లో అన్ని రంగాలు నేడు భల్లూకాల బారిన పడ్డాయి. రంగాల వారిగా మెటల్స్ 2.11 % , రియాలిటి 2.51 % అత్యధికం గా నష్టపోయాయి.
రేపు రిజర్వు బ్యాంక్ రిపో , రివర్స్ రిపో రేటు ని 25- 50 బేసిస్ పాయింట్ల మేరకు పెంచటమే కాక కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగం లో కొన్ని పరిమితులు విధించవచ్చన్న అంచనాల తో నేడు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన స్టాకులు నష్టపోయాయి. IB REAL ESTATE, HDIL, DLF, UNITECH, PARSAVANATH మున్నగు స్టాకులు 0.5 % నుండి 4 % మేరకు క్షీణించాయి. GOLDMAN SACH కంపనీ కి వాటాలు కలిగిన RAIN COMMODITIES 4 .16% , CESC 1.14 % , COX & KINGS 3.33 %, ICSA 4.68 % , MASTEK 2.28 % , NDTV 2.11 % ,LANCO INFRATECH 2.28 %, AFTEK 2.35 % మేరకు క్షీణించాయి. ఐస్ లాండ్ లో ని అగ్ని పర్వతం నుండి వెలవడుతున్న బూడిద వలన విమాన సేవలకు అంతరాయం కలుగుతున్నందున JET AIRWAYS 6.47 %, KING FISHER 2.82 %, SPICE JET 4.17 % నష్టపోయాయి. విమాన సేవలకి అంతరాయం కలుగుతున్నందున ప్రపంచ విపణుల లో క్రూడ్ ఆయిల్ ధరలు డిమాండ్ లేక ధర పడిపోవటం తో మన మార్కెట్ల లో CAIRN 3.22 % , RELIANCE 2 % మేరకు నష్టపోయాయి.
నేడు SESA GOA , SAIL, TATA STEEL,ISPAT INDUSTRIES, STERLITE INDUSTRIES మున్నగు స్టాకులు కూడా 2 % నుండి 4 % మేరకు నష్టపోయాయి. బ్రహ్మని స్టీల్స్ లో వాటా కొనుగోలు చేస్తున్న నేపధ్యం లో JSW STEEL 5 % నష్టపోయింది. అర్జంటినా కి చెందిన కంపనీ ని కొనుగోలు చేయవచ్చన్న అంచనాల తో GODREJ CONSUMER PRODUCTS 2.82 % లాభపడింది. కాగా రైల్వే శాఖ నుండి ఆర్డర్ పొందిన ABB స్వల్పం గా లాభపడింది. STRIDES ARCO నకు US FDA నుండి కాన్సెర్ కి సంబంధించిన మందు కి ఆమోదం లభించటం విశేషం . 94 % వార్షిక వృద్ధి సాధించిన INDUS IND BANK 3.38 % లాభపడింది.
ఇక సెన్సెక్స్ స్టాకు ల లో HINDALCO 1.89 %, BHARTI AIRTEL 0.56 % లాభపడగా , DLF 4.15 % , TATA STEEL 3.56 % నష్టపోయి మార్కెట్ బలహీనత కి కారణమయ్యాయి .