• 19-4-2010
  • మార్కెట్ నాడి

శుక్రవారం అమెరికా మార్కెట్ల కు GOLDMAN SACH షాక్ తగలటం తో గడిచిన రెండు నెలల లో మొదటి సారిగా భారి స్థాయి లో నష్టపోయింది . GOLDMAN SACH గ్రూపు అవక తవకలకి పాల్పడినందున , ఈ గ్రూపు పై నష్టపరిహారా దావా వేయనున్నట్లు అమెరికా ప్రకటించటం తో , ఫైనాన్సు కంపనీల ను అక్కడి ప్రభూత్వం మరింత కట్టడి చేయవచ్చన్న అంచనాల తో అమెరికా మార్కెట్లు క్షీణించాయి. ఈ కారణం గా నేడు ఆసియా మార్కెట్ల లో సైతం బలహీనత చోటు చేసు కుంది. ముఖ్యం గా మైనింగ్ రంగం, కామోడిటి లు నష్టపోతున్నాయి. ఇది ఇలా ఉండగా , చైనా లో రియల్ ఎస్టేట్ రంగం పై అక్కడి ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది. బ్యాంకులకు మూడవ సారి గృహ రుణాలను ఇవ్వకూడదని సూచించింది. ఈ కారణం గా చైనా మార్కెట్లు కూడా ఆసియా మార్కెట్ల ని మరింత క్రుంగ దీస్తోంది. మన దేశం లో చోటు చేసుకుంటున్న అంశాలను గమనిస్తే, విదేశ సహాయ మంత్రి తరూర్ రాజీనామా ని , మార్కెట్లు ప్రతిపక్షాల విజయం గా భావించ వచ్చు. పైగా మహిళా రిజర్వేషన్ బిల్లు లో రెండు పార్టీలు మిత్ర పక్షం నుంచి వైదోలగటం తో ప్రభుత్వం కొంత బలహీన పడిందన్న అంశం తెలిసినదే. ఈ కారణాల వలన ప్రతిపక్షాలు ఫైనాన్సు బిల్లు పై cut motion తీర్మానం పెట్టేందుకు మరింత సానుకూల వాతావరణం ఏర్పడింది. దీనితో ఇన్సురన్సు రంగం మరియు ఇతర రంగాల లో ఆర్ధిక సంస్కరణలు అమలు జరిపేందుకు మరింత జాప్యం జరిగే సూచనలు పెరిగాయి. ఈ అంశం వలన మన మార్కెట్లు బలహీన పడే ఆస్కారం ఉంది . ఏప్రిల్ 20 రిజర్వు బ్యాంకు సమీక్ష లో వడ్డీ రేటు ని పెంచనున్న వార్త ని కూడా మార్కెట్లు నేటి ట్రేడింగ్ లో డిస్కౌంట్ చేయనున్నాయి. కాబట్టి నేటి మార్కెట్లు రక్త సిక్తం అయ్యే సూచనలే అధికం గా ఉన్నాయి . స్టాకు ల పరం గా టెలికాం స్టాకులు , 3G వేలం లో ఇప్పటికే భారిగా మూల్యం చెల్లించేందుకు సిద్ధపడుతున్నాయి. ఈ కారణం గా , ఆయా కంపనీల లాభాల కు గండి పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ స్టాకులు బలహీన పడే అవకాశం ఉంది.

నేడు మార్కెట్లు భారి గా కోల్పోయి రక్త సిక్తం గా మారే సూచనలు ఉన్నాయి కాబట్టి అనుభవం లేని వారు దూరం గా ఉండటం మంచిది. నేడు మార్కెట్ల లో భల్లూకాలు వీరంగం సృష్టించ నున్నాయి.!

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు:: 17591
  • అవరోధాలు :17670- 17780-17830-
  • మద్దతు స్థాయిలు :17440-17336-17221