- మార్కెట్ రిపోర్ట్
ఆద్యంతం బలహీనం గా ట్రేడ్ ఐన మన మార్కెట్లు నేడు కూడా నష్టాలను మూట గట్టుకున్నాయి. దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 48 పాయింట్లు కోల్పోయి 17591 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 11పాయింట్ల నష్టం తో 5262 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.27 శాతం, స్మాల్ క్యాప్ రంగం 0.19 శాతం నష్టాలను చవిచూసాయి. సేక్టోరల్ ఇండెక్స్ ల లో కన్సుమేర్ డ్యురబుల్ రంగం 1.89 శాతం లాభపడగా FMCG 1.22 % లాభపడింది. కాగా నేడు పవర్ రంగం 0.71 % లో వోల్టేజ్ కి గురికాగా PSU రంగం ౦.62 % క్షీణించింది.
స్టాకుల వారిగా పరిశీలిస్తే ఈ సెషన్‌లో తొలిసారి లిస్టింగ్ అయిన గోయంకా డైమండ్ ఇష్యూ ధర 135 రూపాయలపై 8.81 శాతం నష్టంతో 123.10 రూపాయలకు పడిపోయింది. ఇండస్ ఇండ్ బ్యాంకు 94 % నికరల లాభాల లో వృద్ధి కనపరిచి నప్పటికీ 2.19 % నష్టపోయింది.
సెన్సెక్స్ స్టాకు ల లో ITC నేడు అత్యధికం గా 2.47 % లాభపడగా , టాటా స్టీల్ 1.33 % ఎగబాకింది. కాగా జై ప్రకాష్ 2.47 % , DLF 2.44 % నష్టపోయాయి.