• 16-4-2010
  • మార్కెట్ నాడి
నిరుద్యోగ భత్య లబ్దిదారుల సంఖ్య పెరగటం తో గత రాత్రి అమెరికా మార్కెట్ల లో అమ్మకాల వత్తిడి హెచ్చింది. దీనితో నేడు ఆసియా మార్కెట్లు కూడా గత మూడు రోజుల బుల్ రన్ కి స్వస్తి చెప్పి లాభాల స్వీకరణ పై మొగ్గు చూపుతున్నాయి. MSCI ASIA PACIFIC ఇండెక్స్ కూడా నేడు 20 నెలల గరిష్ట స్థాయిల నుండి క్షీణించటం తో ఆసియా మార్కెట్లు నష్టాలబాట పడుతున్నాయి. చైనా వృద్ధి 11.9 % నమోదు కావటం తో రియల్ ఎస్టేట్ రంగం లో స్పెక్యులేషన్ ని కట్టడి చేసే విధం గా చైనా కసరత్తు చేస్తోంది. ఈ కారణం గా చైనా మార్కెట్లు కూడా మరింత నష్టాల తో ట్రేడ్ అవుతున్నాయి.
మన మార్కెట్ల పరం గా యోచిస్తే, ద్రవ్యోల్బణం తగ్గేందుకు మూడు నెలలు పడుతుందన్న ఆర్ధిక మంత్రి వ్యాఖ్యానం వలన , రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేటుని ఏప్రిల్ 20 న చోటు చేసుకోబోయే సమీక్ష లో పెంచగలదన్న వాదన కి ఊతం ఇచ్చినట్లయ్యింది. అదే విధం గా ఉత్తర భారత దేశం లో ఈ సారి ఋతుపవనాలు సాధారణం కంటే తగ్గువగా నమోదు అయ్యే అవకాశం లేక పోలేదని నిపుణులు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. అప్పుడు ఆహార ధాన్యాల కొరత తీవ్ర తరం కాగలదని హెచ్చరించటం గమనార్హం. ముఖ్యం గా చెరుకు పంట పై అనిశ్చిత పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయాలని వ్యక్తపరుస్తున్నారు. ఇది ఇలా ఉండగా సెప్టెంబర్ 30 నాటికి విదేశీ ఫండ్లు తమ రూప కల్పన గురించి పూర్తి వివరాలు KYC నియమావళి లో భాగం గా తెలియచేయాలని SEBI ఉత్తరువులు జారి చేసింది. ఇప్పటికే SOCIETI GENERALE మున్నగు సంస్థలు యధేచ్చ గా నియమాలను ఉల్లంఘించటం తెలిసినదే. ఇటువంటి ఫండ్ల పై పూర్తి నియంత్రణ సాధించాలని SEBI ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అంశం విదేశీ మదుపరులకు ఒకే సారి జీర్ణించు కోలేక పోవచ్చు. ఈ అంశం కూడా నేటి మార్కెట్ సెంటిమెంట్ ని దెబ్బ తీయ వచ్చు .
గత మూడు రోజులు గా నష్టపోతున్న మన మార్కెట్ల లో నేడు కూడా ప్రారంభం బలహీనం గా అయ్యే అవకాశం ఉంది. ఐతే నేడు వారాంతం కనుక ,గత మూడు రోజులు గా మార్కెట్ల లో ఏర్పడ్డ షార్ట్ పొజిషన్లను ట్రేడర్లు కవర్ చేసుకునే ప్రయత్నం చేయవచ్చు . కాబట్టి స్టాకుల వారిగా కొంత చౌక బేర సారాలు కనిపించే ఆస్కారం ఉంది.
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు:: 17639
  • మద్దత్తు స్థాయిలు : 17558-17445-17354
  • అవరోధాలు : 17692-17780-17910-17990.