• 15-4-2010
  • మార్కెట్ రిపోర్ట్

మన మార్కెట్లు వరుసగా మూడవ రోజు నష్టపోయాయి. సానుకూల ఆసియా మార్కెట్ల ప్రభావం తో గ్యాప్ అప్ తో ప్రారంభమన మన మార్కెట్ల కు మధ్యాన్నం తదుపరి బలహీనమైన ఐరోపా మార్కెట్లు, దేశం లో అదే పనిగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం మున్నగు అంశాలు సెంటిమెంట్ ని దెబ్బ తీసి క్షీణింప చేసాయి. దీనితో బొంబాయి స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ 183 పాయింట్ల నష్టాన్ని నమోదు చేస్తూ 17639 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 49 పాయింట్లను విసర్జించి 5273 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.21 శాతం, స్మాల్ క్యాప్ రంగం 0.58 శాతం చొప్పున నష్టపోయాయి. సేక్టోరల్ సూచీ ల లో నేడు రియాలిటి రంగం లో కొనుగోళ్ళు కనిపించటం తో ఈ రంగం అత్యధికం గా 1.59 % లాభపడింది. కన్సుమేర్ డ్యురబుల్స్ ౦. 69 % లాభపడింది. సెన్సెక్స్ సుమో వీరుడైన రిలయన్స్ లో ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకోవటం తో సెన్సెక్స్ తో పాటు చమురు మరియు గ్యాస్ రంగం అత్యధికం గా 1.83శాతం క్షీణించింది. నేడు గరిష్టం గా విడుదల ఐన ద్రవ్యోల్బణ గణాంకాల నేపధ్యం లో రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేటు ని పెంచే ఆస్కారం మరింత గా పెరగటం తో బ్యాంకింగ్ రంగం 1.42% నష్టపోయింది. నేడు విడుదల ఐన టోకు ధరల సూచీ 9.9 % పెరుగుదలని సూచించింది. గత వారం ఇది 9.89 % గా ఉండింది. కాగా ఏప్రిల్ 3 తాలూకు ఆహార ద్రవ్యోల్బణం 17.22 % వార్షిక వృద్ధి ని నమోదు చేసింది.

మేము ఉదయం చర్చించిన విధం గా ICICI, KOTAK, ING VYSYA మున్నగు బ్యాంకులు భారి గా నష్టపోయాయి. యూలిప్ పాలసి ల దెబ్బ వలన నేడు MAX INDIA 9 % పైగా నష్టపోయింది. నేడు విడుదల ఐన CASTROL ఫలితాల లో 54 % వృద్ధి నమోదు చేయటం తో 3.57 % ఎగబాకంది. ఈ కౌంటర్ ని కొనమని మేము నాలుగు రోజుల ముందే సూచించిన విషయం తెలిసినదే . బ్లూ డార్ట్ తమ ఆదాయాన్ని రెట్టిపు గా నమోదు చేయటం తో 20 % ఎగబాకింది.

స్టాకు ల వారిగా విశేషాలను గమనిస్తే, NITIN FIRE నేడు దుబాయి కి చెందిన NEW AGE COMPANY లో వాటాని పెంచుకోవటం తో ఈ కౌంటర్ 2 % నష్టపోయింది. 1 : 2 నిష్పత్తి లో బోనస్ జారి చేయనున్నట్లు ప్రకటించటం తో IVRCL ASSETS & HOLDING 1.66 % ఎగబాకింది.

సెన్సెక్స్ స్టాకు ల లో JAIPRAKASH 1.17 % , HINDUSTAN UNILEVER 0.92 % ఎగబాకాయి. కాగా రిలయన్స్ 2.72 % , ICICI 2.55 % నష్టపోయాయి.