• 15-4-2010
  • మార్కెట్ నాడి

నిన్న మన మార్కెట్లు సెలవ పాటించాయి. ఇదే సమయం లో ప్రపంచ మార్కెట్లు భారి లాభాలను గడించాయి. ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడుతున్న దన్న అంచనాల తో మొన్న అమెరికా మార్కెట్లు లాభపడగా, యూరో మార్కెట్లు సానుకూల పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాల నేపధ్యం లో లాభపడ్డాయి. యూరో దేశాల లో పారిశ్రామిక ఉత్పత్తి లో వృద్ధి 2.8 % గా ఉండగలదని మార్కెట్లు అంచనా వేయగా, అంచనాలని మించి 4.11 % గా వృద్ధి నమోదు కావటం తో నిన్న ఐరోపా మార్కెట్లు రెట్టింపు ఉత్సాహం తో ట్రేడ్ అయ్యాయి. నిన్న అమెరికా మార్కెట్ల లో INTEL , JP MORGAN మున్నగు కంపనీల ఫలితాలు అత్యంత సానుకూలం గా ఉండటం తో అమెరికా మార్కెట్లు ఎగబాకాయి. నేటి ఆసియా మార్కెట్లు కూడా సానుకూల ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో వరుస లాభాలను గడిస్తున్నాయి. చైనా GDP వృద్ధి కి చెందిన గణాంకాలు నేడు విడుదల అయ్యాయి. చైనా వృద్ధి రేటు మార్కెట్ అంచనాలను మించి 11.9 % గా నమోదు కావటం విశేషం . ఐతే నేడు ఆసియా మార్కెట్లు ప్రధానం గా చైనా పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాల పై దృష్టి కేంద్రీకరించ నున్నాయి . ఈ గణాంకాలు గత మూడు సంవత్సరాల గరిష్ట స్థాయి లో నమోదు కాగలదని అంచనాలు. అంచనాల కి అనుగుణం గా గణాంకాలు వెలవడితే, - లోహాలను గరిష్ట స్థాయిల లో వినియోగించే దేశాల లో చైనా అగ్రగామి కనుక నేడు మెటల్స్ - ముఖ్యం గా అల్యూమినియం, రాగి, జింక్, స్టీల్ ధరలు పుంజుకునే అవకాశం ఉంది. పైగా, దేశం వృద్ధి సాధిస్తున్నపటికీ, ఉద్దేపణలు తొందరపడి ఉపసంహరించేది లేదని చైనా స్పష్టం చేయటం కూడా నేడు ఆసియా మార్కెట్ల కి సానుకూల అంశం . ఇక కమోడి టి ల పరం గా - ముడి చమురు , బంగారం ధరలు ప్రపంచ మార్కెట్ల లో బలపడుతున్నాయి.

మన మార్కెట్ల పరం గా యోచిస్తే , గత ట్రేడింగ్ లో ని నష్టాలని, సానుకూల ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో అధికమించే ప్రయత్నం చేయనున్నాయి. ముఖ్యం గా , అమెరికా, ఐరోపా కి చెందిన వాతావరణ నిపుణులు, ఈ సంవత్సరం మన దేశం లో ఋతుపవనాలు సంతృప్తికరం గా ఉండగలదని జోస్యం చెప్పటం మన మార్కెట్ల కి ఉత్సాహం కలిగించే అంశం. అదే విధం గా ఇడేల్ వైస్ సంస్థ మన దేశపు మిడ్ క్యాప్ స్టాకు లను కొనుగోలు చేయవచ్చని, ముఖ్యం గా మీడియా , నిర్మాణం, ఫైనాన్స్ రంగాలకి చెందిన మిడ్ క్యాప్ స్టాకు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయని తెల్చిచేప్పటం కూడా మన మార్కెట్లకి కలిసొచ్చే అంశం . ఇది ఇలా ఉండగా , యూలిప్ పాలసీలను ఏప్రిల్ 9 నుండి నిషేదిస్తున్నట్లు SEBI ప్రకటించటం మార్కెట్లను కొంత నిరాశ పరచ నున్నది. ఈ కారణం గా మరల యూలిప్ విక్రయ దారులు కొంత కష్టాలను ఎదురుకునే ఆస్కారం ఉంది. పైగా రిజర్వు బ్యాంక్ నిభంధనల ఆధారం గా ICICI BANK, YES BANK, ING VYSYA BANK, HDFC ( రిపోర్ట్ కొరకు ఈ వెబ్సైటు లో ఈక్విటి పేజి ని చూడండి ) మున్నగు బ్యాంకులను విదేశీ బ్యాంకులు గా తీర్పునిచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి మదుపరులు , మార్కెట్లు పెరుగుతున్నాయని , ఈ కౌంటర్ల ను కొనుగోళ్ళు చేయటం సాహసమే అవుతుంది. పైగా అంతర్జాతీయం గా బాసెల్ నియమావళి ప్రపంచ బ్యాంకింగ్ వ్యవహారాల పై కట్టడి చేయనున్నది. మదుపరులు ఈ అంశాలను దృష్టి లో పెట్టుకోవటం శ్రేయస్కరం. అదే విధం గా నేడు విడుదల కానున్న ఆహార ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా మార్కేట్లని ప్రభావితం చేయనున్నాయని మరవకూడదు.

సానుకూల ప్రపంచ మార్కెట్ల కి అనుసంధానం గా నేడు మన మార్కెట్లు భారి లాభాల తో ట్రేడ్ కానున్నాయి. మెటల్స్ , ఐ. టి స్టాకులు బలం గా ట్రేడ్ అయ్యే సూచనలు ఉన్నాయి. సెన్సెక్స్ 18000 పాయింట్ల కంటే ఎగువన నేడు మార్కెట్లు స్థిరపడే అవకాశం ఉంది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు:: 17821
  • మద్దత్తు స్థాయిలు : 17780-17670
  • అవరోధాలు : 17990-18131-18245