• 13-4-2010
  • మార్కెట్ రిపోర్ట్

బలహీన మైన ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో నేడు మన మార్కెట్లు నష్టాలను చవి చూసినప్పటికీ , ఐ.టి స్టాకుల లో చోటు చేసుకున్న కొనుగోళ్ళ సహాయం తో నిలకడ సాధించాయి. దీనితో బొంబాయి స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్31 పాయింట్ల నష్టం తో 17822 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 16.75 పాయింట్ల స్వల్ప నష్టం తో 5323 పాయింట్ల వద్ద ముగిసింది. పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీలు ఏప్రిల్ 15 నుండి ప్రారంభం కానున్న సభల లో ఫైనాన్సు బిల్లు పై కట్ మోషన్ ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు చేస్తూ ఉండటం తో మార్కెట్ల లో ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకుంది . పైగా రేపు మార్కెట్ల కు సెలవ కారణం గా ట్రేడర్లు తమ పోజిషన్లను తగ్గించుకునే ప్రయత్నం చేయటం కూడా మార్కెట్ బలహీనత కి తోడయ్యింది.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.30 శాతం, స్మాల్ క్యాప్ రంగం 0.06శాతం చొప్పున నష్టపోయాయి. కాగా సేక్టోరల్ సూచీ ల లో ఆటో ఇండెక్స్ నేడు అత్యధికం గా 1.32 శాతం కోల్పోయింది. కాగా బ్యాంకింగ్ రంగం 0.87 % నష్టపోయింది. ఐతే నేడు ఇన్ఫోసిస్ ఫలితాలు పర్వాలేదన్న రీతి లో వెలవడటం తో ముందు గా కొంత మందకొడి గా ట్రేడ్ అయినా తదుపరి కనిష్ట స్థాయి ల నుండి 6 శాతం ఎగబాకటం తో ఇతర ఐ. టి స్టాకుల లో కూడా కొనుగోళ్ళు కనిపించాయి. దీనితో ఐ .టి సూచీ అత్యధికం గా శాతం లాభపడింది. నేడు టెక్ రంగం కూడా 2.04 % లాభపడ్డాయి . స్టాకు ల పరం గా ROLTA , అమెరికా కి చెందిన OneGIS Inc కంపని ని కొనుగోలు చేయటం తో 2.70 % ఎగబాకింది

సెన్సెక్స్ స్టాకు ల లో నేడు హీరో హోండా అత్యధికం గా 5.29 % నష్టపోయింది. ఈ కౌంటర్ నేటి తో EX - DIVIDEND అవ్వటం తో ఈ కౌంటర్ పతనమయ్యింది. కాగా 3 G వేలం లో పోటి పెరుగుతున్నందున టెలికాం స్టాకులు నష్టపోగా ,ప్రధానం గా RCOM 2.69 % నష్టపోయింది . నేడు ఇన్ఫోసిస్ 3.69%, TCS 2.80 % లాభ పడ్డాయి.