- 12-4-2010
- మార్కెట్ నాడి
శుక్రవారం అమెరికా మార్కెట్లు , గ్రీస్ దేశపు సంక్షోభానికి తెరపడటం వలన లాభాల తో ముగిసాయి. నేడు ఆసియా మార్కెట్లు కూడా ఇదే రీతిన గత రెండు రోజుల లాభాల పరంపర ని కొనసాగిస్తున్నాయి. గ్రీస్ దేశానికి 45 బిలయేన్ యూరో ల ఆర్ధిక సహాయం చేయాలని యూరో దేశాలు నిర్ణయం తీసుకోవటం తో , ప్రపంచ మార్కెట్లు ఊపిరి తీసుకున్నాయి. ఈ ఋణం లో 30 బిలియెన్ యూరో లను యూరో దేశాలు అందచేయనున్నాయి. కాగా 15 బిలయేన్ యూరో లను IMF అందచేయనున్నది. ఈ ఋణం మార్కెట్ వడ్డీ రేటు కంటే అతి తక్కువగా , 5 % వడ్డీ రేటు తో , మూడు సంవత్సరాల వ్యవధి లో వితరణ జరగ నున్నది. ఈ కారణం గా గ్రీస్ దేశానికి , కోలుకునేందుకు మూడు సంవత్సరాల వ్యవధి లభించటం తో మదుపరులకు భరోసా కలిగించి నట్లయ్యింది.
మన మార్కెట్ల పరం గా విశ్లేషిస్తే , నేడు ఫిబ్రవరి మాసపు తాలూకు పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ అంకెలు నేడు మన మార్కెట్ల్ ని ప్రభావితం చేయ నున్నాయి . అదే విధం గా రిజర్వు బ్యాంక్ బ్యాంకులకు వర్తింప చేసే PRIMARY LENDING RATE నియమాల లో మార్పులు తేవటం తో బ్యాంకులకు ఇప్పుడు ,తమ కష్ట మర్ల నుండి సమానం గా వడ్డీ ని వసూలు చేయవలసి ఉంటుంది. ఇప్పటి వరకు పెద్ద పెద్ద కార్పోరేట్లకు కొన్ని బ్యాంకులు తగ్గింపు వడ్డీ పై రుణాలను అందిస్తున్నది తెలిసినదే. దీనివలన , ఇటువంటి రుణాలను వితరణ చేస్తున్న ప్రైవేటు బ్యాంకు ల ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది. నేటి నుండి విడుదల కానున్న కార్పో రేట్ త్రై మాసిక ఫలితాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేయనున్నది. గడిచిన సంవత్సరం లో ఇదే సమయానికి అత్యంత కనిష్ట స్థాయి లో కంపనీల లాభాలు నమోదు కావటం వలన , ఈ సారి , గత సంవత్సరపు ఆదాయాల తో పోల్చి చూస్తె, గణనీయ వృద్ధి కనపరచ నున్నాయి. ఈ కారణం గా దాదాపు అన్ని కంపనీల ఫలితాలు సానుకూలం గా నే వెల వడే అవకాశం ఉంది. ఈ కారణం గా మార్కెట్లు మరింత గా పుంజుకునే అవకాశం ఉంది. ఐతే దేశం లో అతి పెద్ద రెగ్యులేటర్ లు ఐన SEBI, IRDA యూలిప్ పాలసి ల అమ్మకాల పట్ల అమి తుమీ లంటూ మదుపరులను అయోమయ స్థితి లో పడవేశాయి. ULIP అమ్మకాలను నిషేదిస్తున్నట్లు SEBI ప్రకటించటం , ULIP లు అమ్ముకోవచ్చని IRDA తెల్చిచేప్పటం , ముఖ్యం గా ULIP పై నిర్ణయాలు తీసుకునే అధికారం SEBI కి లేదని IRDA నిప్పులు కక్కటం తో ULIP ఇన్సురెన్స్ పాలసి లను అమ్మే కంపనీలు , పాలసి దారులు, మదుపరులు, మార్కెట్ల లో అయో మాయ స్థితి నెలకొని ఉన్నది. తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ఇరు రెగ్యులేటర్లు ఒకరి పై ఒకరు అస్త్రాలు సంధించుకుంటున్నారు. కాగా ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఈ అంశం ఇరు పక్షాలు తేల్చు కోవాలి కాని మాకు సంబంధం లేదని చేతులు దులిపెసుకోవటం గమనార్హం. ఈ కారణం గా ULIP లను అమ్మే కంపనీలైన HDFC , MAX INDIA, KOTAK BANK, ICICI BANK ,BAJAJ AUTO FIN, మున్నగు కంపనీల పై నేడు వత్తిడి కనిపించే అవకాశం ఉంది.
సానుకూల ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో నేడు మార్కెట్లు లాభ పడినా, 18050 పాయింట్ల సమీపం లో మరల అమ్మకాల వత్తిడి కి గురి అయ్యే అవకాశం ఉంది.