- 12-4-2010
- మార్కెట్ రిపోర్ట్
యూలిప్ పాలసి పై నెలకొన్న అయోమయ స్థితి, IRDA- SEBI మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు కారణం గా నేడు మన మార్కెట్లు బలహీనం గా ట్రేడ్ అయ్యాయి.పైగా అంచనాలని వమ్ము చేస్తూ వెలవడిన ఫిబ్రవరి తాలూకు IIP గణాంకాలు మార్కేట్లని మరింత గా కృంగదీసాయి . దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 80 పాయింట్ల నష్టాన్ని నమోదు చేస్తూ 17853 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 23 పాయింట్ల నష్టం తో 5339 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.1 %నష్టపోగా, స్మాల్ క్యాప్ రంగం మాత్రం 0.31 శాతం లాభపడింది.
నేటి సేక్టోరల్ సూచీ ల లో FMCG 0.70 %, రియాలిటి 0.57 % లాభపడగా ,ఆటో ఇండెక్స్ 0.85 % నష్టపోయింది. కాగా క్యాపిటల్ గూడ్స్ రంగం అత్యధికం గా 1.25 % నష్టపోయింది. నేడు విడుదల ఐన ఫిబ్రవరి తాలూకు పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు కేవలం 15.1 % వృద్ధిని నమోదు చేసింది. వృద్ధి రేటు కనీసం 16.5 % వుండ గలదన్న మార్కెట్ అంచనాలు తారుమారు కావటం తో మార్కెట్లు మరింత క్షీణించాయి.
యూలిప్ పాలసి ల పై ఏర్పడ్డ తాజా పరిస్థిని నివేదించేందుకు ఆర్ధిక శాఖ అధికారుల తో నేడు IRDA చైర్మన్ చర్చలు జరిపారు . ఇదే రీతి ని SEBI చైర్మన్ కూడా అవలంభించ వచ్చు. ఈ ఇరు రెగ్యు లెటర్ల మధ్య నెలకొని ఉన్న ఆధిపత్య పోరు లో మార్కెట్లు చతికిలబడ్డాయి. దీనితో , మధ్యాన్నం తాజా ట్రేడింగ్ లో ఐరోపా మార్కెట్లు , బలం గా ట్రేడ్ అవుతున్నప్పటికీ , మన మార్కెట్లు మాత్రం నష్టపోయాయి.
స్టాకు ల పరం గా నేడు ICICI BANK 1.26 % , KOTAK BANK 2.3 %, SBI 0.69 % నష్టపోయాయి. గత రెండు రోజులు గా లాభపడ్డ ఆటో రంగం లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవటం తో నేడు TATA MOTORS 3.24 % , MNM 2 % ,ASHOK LEYLAND 0.45 % నష్టపోయాయి. నేడు రూపాయి మారక విలువ 19 నెలల గరిష్ట స్థాయి చేరుకోవటం తో ఐ .టి స్టాకులు బలహీనం గా ట్రేడ్ అయ్యాయి. ఐతే రేపు విడుదల కానున్న ఇన్ఫోసిస్ ఫలితాల నేపధ్యం లో ఈ కౌంటర్ మాత్రం 0.16 % లాభపడింది. చైనా ముడి ఇనుము దిగుమతుల పై నిషేధం ప్రకటించటం తో సేస గోవా 2 .70 % కోల్పోయింది. నిధుల సమీకరణ ప్రతిపాదనల తో GMR INFRA 1.22 % లాభపడింది. Q4 ఫలితాలు ఆశాజనకం గా ఉండటం తో STEELSTRIPS 1.6 % లాభపడింది .
నూతన ఆర్డర్లు దక్కించు కోవటం తో ENERGY DEVELOPMENT COMPANY ( 20 % ) , PRATIBHA ( 4.6 % ) లాభపడ్డాయి.
సెన్సెక్స్ స్టాకు ల లో నేడు HERO HONDA 1.47 % , SUN PHARMA 1.27 % అత్యధికం గా లాభపడ్డాయి. కాగా TATAMOTORS 3.24 % , LNT 2.04 % మేరకు నష్టపోయాయి.