• 09-4-2010 /friday
  • మార్కెట్ రిపోర్ట్

సానుకూల ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో నేడు ఆద్యంతం మార్కెట్లు లాభాల బాట నడిచాయి. నిన్నటి ట్రేడింగ్ లో భారి గా దెబ్బ తిన్న బుల్ల్స్ , నేడు ఎదురు దాడి జరిపాయి. దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 219గా లాభపడి 17993పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 57పాయింట్ల లాభం తో5362 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్ లో మేము ఉదయం సూచించిన విధం గా నే pull back rally చోటు చేసుకుని , మా అంచనాలకి అనుగుణం గా కీలక అవరోధమైన 17940 పాయింట్ల అవరోధాని కి అత్యంత సమీపం గా 17933 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ముగియటం విశేషం .

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ 0.9 శాతం , స్మాల్ క్యాప్ రంగం 1.27 శాతం లాభపడగా, సేక్తోరాల్ సూచీ ల లో అన్ని రంగాలు కూడా లాభపడటం విశేషం. నేడు బ్యాంకింగ్ రంగం , క్యాపిటల్ గూడ్స్ రంగం 1.41 % చొప్పున అత్యధికం గా లాభపడ్డాయి.

నిన్న భారి గా కోల్పోయిన బ్యాంకింగ్ రంగం లో నేడు కొనుగోళ్ళు చోటు చేసుకోవటం తో HDFC, AXIS, KARNATAKA BANK, IDBI మున్నగు స్టాకులు 3.3 % నుండి ౦.6 % మేరకు లాభపడ్డాయి. UK లో తమ ల్యాండ్ రోవేర్ గరిష్ట స్థాయి లో అమ్మకాలు జరిగి, కొత్త రికార్డు సృష్టించటం తో TATA MOTORS 4.5 % ఎగబాకింది.

బంగళూరు అయిర్ పోర్ట్ యాజమాన్యాన్ని హస్తగతం చేసుకోవటం తో GVK POWER & INFRA 2.45 % ఎగబాకింది. CHOLAMANDALAM DBS లో తమ పెట్టుబడిని పెంచటం తో TUBE INVESTMENT 3.6 % లాభపడింది. నేడు లిసిటింగ్ జరిగిన గణేష్ జ్వేలేరి కి ఆది లోనే చుక్కెదురయ్యింది.

తోలి విడుత 3 G వేలం ప్రారంభం కావటం తో నేడు AIRTEL, IDEA నష్టపోగా RCOM ,TTML లాభపడ్డాయి.

ప్రైవేటు విమానా ల చార్జీలు 10- 12 % పెంచనున్న నేపధ్యం లో JET AIRWAY 7 % , KFA 2.5 % SPICE JET 7 % ఎగబాకాయి .నేడు హోటల్ రంగానికి చెందిన స్టాకులు కూడా లాభపడ్డాయి .నేడు అరంగేట్రం చేసిన GANESH JWELLERY కి ఆది లో నే చుక్కెదురయ్యింది. ఈ కౌంటర్ లిసిటింగ్ రోజున 37 % నష్టపోయింది.

ఇక సెన్సెక్స్ స్టాకు ల లో నేడు TATAMOTORS 4.51 % , HDFC 4.4 % అత్యధికం గా లాభపడగా , AIRTEL 1.52 % , WIPRO 0.82 % నష్టపోయాయి.