• 13-4-2010
  • మార్కెట్ నాడి
గ్రీస్ దేశం లో నెలకొని ఉన్న సంక్షోభానికి తెరపడటం తో గత రాత్రి అమెరికా మార్కెట్లు లాభపడ్డాయి. సెప్టెంబర్ 2008 తదుపరి మొదటి సారి గా డవ్ 11000 పాయింట్లు దాటి స్థిరపడటం విశేషం. అమెరికా మార్కెట్లు సానుకూలం గా ముగియటం తో నేడు ఆసియా మార్కెట్లు కూడా శుభారంభం చేసాయి. చైనా కరెన్సీ యాన్ మారక విలువని ఇప్పటివరకు నియంత్రిస్తున్న చైనా ప్రభుత్వం , అమెరికా అవలంబిస్తున్న వ్యూహాత్మక చర్చల నేపధ్యం లో , చైనా తమ పట్టు విడిచే అవకాశం ఉంది. ఈ కారణం గా యాన్ మారక విలువ పెరిగే సూచనలు ఉన్నాయి. ఇదే జరిగితే చైనా దేశానికి ఎగుమతులు మరింత గా ఊపందుకోనున్నాయి . ఈ అంశం ప్రపంచ మార్కెట్ల కు అనుకూలం . ఐతే ఆగ్నేయ ఆసియా లో వృద్ధి గణనీయం గా ఉందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ ( ADB) రిపోర్ట్ ని విడుదల చేసింది. ఆసియా దేశాలు కీలక వడ్డీ రేటు ని పెంచక పొతే అసెట్ బుడగ తప్పదని హెచ్చరించటం తో నేటి ఆసియా మార్కెట్లు తిరిగి నష్ట పోతున్నాయి. అమెరికా SNP ఫ్యుచేర్స్ కూడా నష్టపోతున్నందున , ఆసియా మార్కెట్ల లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంటున్నది.
మన మార్కెట్ల గురించి ప్రస్తావిస్తే, యూనిట్ ఆధారిత పాలసి ల పై ( ULIP ) ఆర్ధిక మంత్రిత్వ శాఖ సూచన మేరకు IRDA, SEBI లు ఈ విషయాన్ని కోర్టు లో తేల్చుకోవాలని , అంత దాకా యధా స్థితి ని కొనసాగించాలని తీసుకున్న నిర్ణయం మన మార్కెట్ల లో ఊపిరి నింప నున్నది. నేడు విడుదల కానున్న Q4 ఇన్ఫోసిస్ ఫలితాలు మన మార్కెట్ సెంటిమెంట్ ని ప్రభావితం చేయనున్నది. సానుకూల ఫలితాలు ఇతర ఐ. టి కంపనీల స్టాకు లను కూడా బలోపేతం చేసే అవకాశం వుంది.
Q 4 ఫలితాలు సానుకూలం గా ఉంటే , నిన్నటి నష్టాలను అధిగమిస్తూ కొంత ముందంజ వేసే ప్రయత్నం మన మార్కెట్లు చేయనున్నాయి. ఐతే బలహీన మైన ఆసియా మార్కెట్ల ప్రభావం వలన లాభాలు ఎక్కువ సేపు నిలిచే అవకాశం తక్కువ. పరస్పర విరుద్ధ అంశాల వలన నేడు మార్కెట్లు ఆటు పొట్ల కు గురి అయ్యే సూచనలు ఉన్నాయి.
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు:: 17853
  • మద్దత్తు స్థాయిలు : 17805-17670-17558
  • అవరోధాలు : 17940-17990-18048