- 09-04-2010
- మార్కెట్ నాడి
గత రాత్రి గ్రీస్ సంక్షోభం నేపధ్యం లో బలహీనం గా ప్రారంభమైన అమెరికా మార్కెట్లు అత్యంత సానుకూల రిటైల్ అమ్మకాల గణాంకాల నేపధ్యం లో మరల ఎగబాకి లాభాల తో ముగిసాయి. సెంటిమెంట్ బలపడటం తో నేడు ఆసియా మార్కెట్లు కూడా , నిన్నటి లాభాల స్వీకరణ తదుపరి, మరల శుభారంభం చేసాయి. నిన్న దారుణం గా కోల్పోయిన బ్యాంకింగ్ , మెటల్స్ రంగాల లో నేడు చౌక బేరాల తో కొనుగోళ్ళు కొనసాగుతున్నాయి.
మన మార్కెట్ల పరం గ యోచిస్తే, నేడు ప్రభూత్వం debt మార్కెట్ లో నిధుల సమీకరణ కై వేలం పాట ని ప్రభుత్వం నిర్వహించనున్నది. ప్రభుత్వం , ఈ సంవత్సరపు పూర్వార్థం లో మార్కెట్ల నుండి నిధులను సమీకరించాలన్న యోచన తెలిసినదే. ఇందులో భాగం గా నేడు 120 బిలియన్ డాలర్ల మేరకు వేలం పాటని నిర్వహించ నున్నదీ. ఐతే మార్కెట్లో తగినంత గా లిక్విడిటి లేనందున బాండ్ రెట్లు పడిపోయే అ వకాశం ఉంది.
అదే విధం గా నేడు 3 జి వేలం పాట ప్రారంభం కానున్నది. ఇంటర్నెట్ ద్వారా జరిగే ఈ ప్రక్రియ సుమారు 3 వారాలు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి నేటి నుండి టెలికాం రంగం లో స్టాకులు కొంత సంచలనం సృష్టించే అవకాశం ఉంది. కాగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే యత్నం లో భాగం గా రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేటు పెంచే అవకాశం పెరుగుతున్నందున రేటు ఆధారిత స్టాకులు రానున్న రోజుల లో బలహీన పడే అవకాశం ఉంది.
ఆసియా మార్కెట్లను అనుసరించి మన మార్కెట్ల లో కూడా నేడు కొంత PULL BACK RALLY చోటుచేసుకున్న, గ్రీస్ సంక్షోభం పూర్తిగా ముగియలేదని మదుపరులు గమనించాలి .