- 07-04-2010
- మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా ఫెడ్ ,వడ్డీ రేటుని మరింత కాలం అతి తక్కువ గా ఉంచాలని తీసుకున్న నిర్ణయం తో అమెరికా మార్కెట్ల లో బ్యాంకింగ్ స్టాకులు బలపడటం తో అమెరికా మార్కెట్లు నష్టపోకుండా , ఫ్లాట్ గా ముగిసాయి. ఇది ఇలా ఉండగా , నేడు ఆసియా మార్కెట్లు ఆటు పొట్ల తో ప్రారంభమయి , స్వల్ప లాభాల తో ట్రేడ్ అవుతున్నాయి. ఐదు రోజుల సెలవల అనంతరం నేడు పునః ప్రారంభమైన హాంగ్ కాంగ్ మార్కెట్లు నేడు ప్రపంచ మార్కెట్ల తో అనుసంధానం గా భారి లాభాల తో ట్రేడ్ అవుతున్నది. ఐతే ఇప్పటికే వరుసగా లాభాలను ఆర్జించిన ఇతర ఆసియా మార్కెట్ల లో ఎప్పుడైనా లాభాల స్వీకరణ కి గురి అయ్యే ప్రమాదమున్నదని గమనించాలి. ముఖ్యం గా గ్రీస్ దేశం లో చోటుచేసుకుంటున్న అంశాలు ఈ వాదన కి బలం చేకూరుస్తోంది. గ్రీస్ బాండ్ మార్కెట్ల లో రేటు భారి గా పెరుగుతున్నందున గ్రీస్ దేశపు ఆర్ధిక వ్యవస్థ పై మరొక సారి సందేహాలు వ్యక్త మౌతున్నాయి. ఇప్పటివరకు IMF నుండి సహాయం అందకపోవటం తో , ఇందుకు కారణం జర్మనీ అని గ్రీస్ దేశం ప్రెసిడెంట్ నిప్పులు కక్కుతున్నందున , జర్మనీ కూడా IMF లో తమ VETO ని ఉపయోగించి సహాయాని నిలిపివేసే ప్రమాదమున్నదని మదుపరులు గ్రీస్ దేశపు బాండ్ ల పై విముఖత కనపరుస్తున్నారు. ఈ అంశం పై చోటు చేసుకోబోయే సంఘటనలు ప్రపంచ మార్కట్ల ను విస్మయ పరిచే అవకాశం ఉంది.
పైగా మన దేశం లో ఈక్విటి మార్కెట్లు ఇప్పటి కే గరిష్ట స్థాయి లో, ఆదాయానికి మించి న విలువల తో ట్రేడ్ అవుతున్నందున రాగల మూడు నెలలు అప్రమత్తం గా ఉండాలని మదుపరులకు TAURUS FUND సూచించటం గమనార్హం.
ఇక మన మార్కెట్ల పరం గా యోచిస్తే, గత సంవత్సరపు కనిష్ట ష్టాయి లో వున్న ఆదాయం తో పోల్చి చూస్తె, ఈ సంవత్సరం కార్పోరేట్ ఆదాయం సంతృప్తి కరం గా భారి వృద్ధి ని నమోదు చేయటం వలన మన మార్కెట్ల లో స్టాకు ల పరం గా ఎగబాకే అవకాశం ఉంది. కాగా నిన్న ఛత్తీస్ గడ్ లో మావోలు చేసిన దాడి వలన NMDC కార్యకలాపాలకి ఆటంకం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ కౌంటర్ నేడు కొంత వత్తిడి కి గురి అయ్యే ప్రమాదమున్నది. కరెన్సీ మార్కెట్ల లో రిజర్వు బ్యాంక్ కలగ చేసుకుని పెరుగుతున్న రూపాయి విలువని అరికట్టే ప్రయతం చేసే అవకాశం ఉంది. కాబట్టి నేడు ఐ. టి రంగం స్టాకు ల లో కొంత PULL BACK RALLY కనపడవచ్చు
గరిష్ట స్థాయి ల లో మార్కెట్లు ట్రేడ్ అవుతున్నందున మదుపరులు అప్రమత్తం గా వ్యవహరించటం మంచిది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు:: 17941
- మద్దత్తు స్థాయిలు : 17910-17780-17670
- అవరోధాలు : 17990-18131-18245