• 06-04-2010
  • మార్కెట్ రిపోర్ట్
తీవ్ర ఆటు పొట్ల కి గురి అయిన మన మార్కెట్లు నేడు ఫ్లాట్ గా ముగిసాయి. దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ కేవలం 5 పాయింట్లు లాభపడి 17941 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 2 పాయింట్ల నష్టం తో 5366 పాయింట్ల వద్ద ముగిసింది. ఆద్యంతం 17991- 17898 పాయింట్ల నడుమ సంచరించిన సెన్సెక్స్ నేడు , మేము ఉదయం సూచించిన రీతి లో 17990 పాయింట్ల కీలక అవరోధాన్ని చేదించ లేక పోయింది. నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.68 % లాభపడగా, స్మాల్ క్యాప్ రంగం 0.52 % ఎగబాకాయి. BSE సేక్టరాల్ సూచీ ల లో నేడు కూడా రియాలిటి రంగం అత్యధికం గా లాభపడింది. ఈ రంగం 1.40శాతం వృద్ధిని నమోదు చేసింది. కాగా పవర్ రంగం 0.72 % లాభపడింది. గత రెండు రోజులు గా జోరు కొనసాగించిన ఆటో రంగం లో నేడు ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకుంది. ఈ రంగం నేడు 1.02 % క్షీణించింది. బలపడుతున్న రూపాయి కారణం గా ఐ.టి రంగానికి చెందిన స్టాకులు కూడా నష్టపోవటం తో ఈ రంగం ౦.95 % నష్టపోయింది.
నేడు TATA MOTORS, BAJAJ AUTO, MNM,మారుతి , ASHOK LEYLAND మున్నగు స్టాకులు 1% - నుండి 2.5 % మేరకు క్షీణించాయి. ఐ. టి. స్టాకుల లో ఇన్ఫోసిస్, TCS, WIPRO మున్నగు అగ్రగామి స్టాకులు నష్టపోయాయి.
ఫండ్ల పోర్ట్ఫోలియో లో చోటుచేసుకుంటున్న మార్పుల వలన నేడు పవర్, FMCG, రియాలిటి స్టాకులు లబ్ది పొందాయి. నూతన ఆర్డర్లు సంపాదించటం తో SHRIRAM EPC 6 % లాభపడింది. 1 :1 నిష్పత్తి లో బోనస్ అందించ నున్నందున CASTROL 4 % ఎగబాకింది . నేడు అరంగేట్రం చేసిన PERSISTENT SYSTEM 32 % వృద్ధి సాధించింది. నూతన కుక్కర్ మాడల్లను విడుదల చేసిన TTK PRESTIGE 1.6 % లాభపడింది.
సెన్సెక్స్ స్టాకుల్ ల లో నేడు MNM 2.36% , MARUTI 1.37 % అత్యధికం గా నష్టపోగా , BHEL 2.8%,RCOM 2.61 % మేరకు లాభపడ్డాయి.