- 06-04-2010
- మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా మార్కెట్లు భారి గా లాభపడ్డాయి. గృహ అమ్మకాల గణాంకాలు అత్యంత సానుకూలం గా విడుదల కావటం తో , ఆర్ధిక మాంద్యం తగ్గుముఖం పడుతున్నదన్న అంచనాల తో అక్కడి మార్కెట్లు బలపడ్డాయి.
నేడు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా పయనిస్తున్నాయి. గత రెండు రోజులు గా లాభాలను ఆర్జించిన ఆసియా మార్కెట్ల లో నేడు కొంత ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యం గా జాపాన్ మార్కెట్ల లో ఈ అంశం ప్రబలం గా కనిపిస్తున్నది.
ఇది ఇలా ఉండగా, అంతర్జాతీయ మార్కెట్ల లో ముడి చమురు ధర కూడా తగ్గుముఖం పడుతున్నది. కాగ రాగి మరింత గా బలపడుతున్నది. కరన్సీ మార్కెట్ల లో అమెరికా వృద్ధి పట్ల ఆశలు చిగురించటం తో అమెరికా డాలర్ కూడా బలపడుతున్నది.
మన దేశం లో చోటు చేసుకున్న కీలక అంశాలు గమనిస్తే, రిజర్వు బ్యాంక్ , బ్యాంకర్ల తో జరిపిన సమావేశం లో సవింగ్స్ ఖాతా పై వడ్డీ రేటు ని పెంచవలసింది గా కోరింది. దీని వలన బ్యాంకుల పై మరింత భారం పడనున్నది. ఈ కారణం గా నేడు బ్యాంకింగ్ స్టాకు ల లో కొంత అమ్మకాల వత్తిడి కన్పించే అవకాశం ఉంది. రిజర్వు బ్యాంక్ ఏప్రిల్ మాసం లో ప్రకటించ బోయే విధానం లో కీలక వడ్డీ రేటు ని కూడా పెంచే సూచనలు ఉన్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కృషి చేయనున్నట్లు బ్యాంకర్ల సమావేశం లో ఈ అసంహం రిజర్వు బ్యాంక్ ప్రకటించటం కీలకం
మిశ్రమ ఆసియా మార్కెట్ల నడుమ నేడు స్టాకుల పరంగా మార్కెట్ల లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది. 18100 sensex పాయింట్ల చేరువ లో మార్కెట్లు మరింత ఆటుపోట్ల కి గురి అయ్యే అవకాశం ఉంది . మార్కెట్లు భారి గా పెరిగాయి కనుక మదుపరులు కొంత ( 50 % ) లాభాలను స్వీకరించటం మంచిది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు:: 17936
- మద్దత్తు స్థాయిలు : 17910-17780-17670
- అవరోధాలు : 17990-18131-18245