- 05-04-2010
- మార్కెట్ రిపోర్ట్
ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడుతున్నదన్న IMF అంచనాల నేపధ్యం లో నేడు మార్కెట్లు , మేము ఉదయం సూచించిన విధం గా భారి గా లాభపడి 52 వారాల గరిష్ట స్థాయి వద్ద ముగిసాయి. దీని తో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 243 పాయింట్లు లాభపడి 17936 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 78 పాయింట్ల లాభం తో 5368 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.45 % లాభపడగా, స్మాల్ క్యాప్ రంగం 1.97 % ఎగబాకాయి. సేక్టోరల్ సూచీ ల లో నేడు ఐ. టి రంగం మినహా మిగిలిన సూచీలన్ని కూడా లాభాల తో ముగియటం విశేషం . రియాలిటి రంగం నేడు అత్యధికం గా 2.66 % లాభపడి సెన్సెక్స్ వృద్ధికి తోడ్పడింది. కాగా చమురు మరియు గ్యాస్ రంగం కూడా 2.03 % ఎగబాకింది. నేడు ఐ. టి రంగం స్వల్పం గా 0.02 శాతం నష్టపోయింది.
విదేశీ సంస్థల కొనుగోళ్ళు కూడా మన మార్కెట్లు లాభ పడేందుకు దోహద పడ్డాయి. మార్చ్ తాలూకు మోటర్ వాహనాల అమ్మకాల గణాంకాలు సానుకూలం గా విడుదల కావటం తో నేడు HERO HONDA 4.40 %, MNM 2.50 % , BAJA AUTO 6 % లాభపడ్డాయి. హిస్సార్ లో నూతన థెర్మల్ ప్లాంట్ యొక్క మొదటి విడత పూర్తి కావటం తో RELIANCE INFRA 5 % ఎగబాకింది. 3G వేలం ని పురస్కరించుకుని నేడు టెలికాం స్టాకుల లో IDEA మినహా ఇతర టెలికాం స్టాకులు 4.5 % నుండి 1.26 % మేరకు లాభపడ్డాయి. మేము ఉదయం అంచనా వేసిన విధం గా నే నేడు స్టీల్ స్టాకులు భారి గా లాభపడి మదుపరులకు లాభాల పంట పండించాయి. TATA STEEL 4 % , JSW STEEL 2.34 % ,SAIL 0.71 % ISPAT 2.51 % లాభపడ్డాయి. ISPAT నేడు టన్ను పై రూ. 2500 చొప్ప్పున ధరని పెంచటం గమనార్హం.
కలకత్తా కి చెందిన NS REMEDIES ని $ 1.50 మిలియన్లను వెచ్చించి కొనుగోలు చేయటం తో
OPTO CIRCUIT 0.62 % లాభపడింది. GMR INDUSTRIES ని కొనుగోలుకై చేస్తున్న ప్రయత్నం ఫలించక పోయే సరికి EID PAARYS నేడు 2 % నష్టపోయింది. తమ వ్యాపారాన్ని పునః వ్యవస్థీకరణ దిశగా ప్రయత్నం చేస్తున్నందుకు BIOCON 2.67 % లాభపడింది. ఇనామి తమ సంస్థను కొనుగోలు చేయట్లేదని స్పష్టం చేయటం తో అమృతాంజన్ 20 % ఎగబాకింది. 827 కోట్ల రూపాయల ఆర్డర్ పొందటం తో MCNALLY BHARAT 3.26 % లాభపడింది. నేడు లిస్టింగ్ జరిగిన ప్రదీప్ ఓవర్ సీస్ 3 % నష్టపోయింది .
ఇక సెన్సెక్స్ స్టాకు ల లో HINDUSTHAN UNILEVER 0.98 % ,GRASIM 0.79 % నష్టపోగా , రిలయన్స్ ఇన్ఫ్రా 5.10 % , భారతి అయిర్ టెల్ 4.45 % లాభపడి సెన్సెక్స్ వృద్ధి కి దోహద పడ్డాయి.