• 01-4-2010
  • మార్కెట్ రిపోర్ట్

సానుకూల చైనా , జపాన్ మరియు ఐరోపా మార్కెట్ల నేపధ్యం లో నేడు మన మార్కెట్లు రెండు రోజుల నష్టాలను పక్కకు పెట్టి లాభాలను ఆర్జించాయి. దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 165 పాయింట్లు లాభపడి 17693 పాయింట్ల వరకు ఎగబాకింది. కాగా నిఫ్టీ 41 పాయింట్లు ఎగబాకి 5290 పాయింట్ల వద్ద నిలిచింది.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.88 శాతం, స్మాల్ క్యాప్ రంగం 2.44 శాతం లాభపడ్డాయి. సేక్టరాల్ సూచీ ల లో ఐ .టి ఇండెక్స్ 2.26 శాతం అత్యధికం గా లాభపడింది. కాగా కన్సుమేర్ డ్యుర బుల్స్ రంగం కూడా 1.54 % మేరకు లాభపడ్డాయి. ఇది ఇలా ఉండగా, FMCG సూచీ 0.22% నష్టపోయింది. ఆటో రంగం కూడా స్వల్పం గా 0.08 % క్షీణత ని నమోదు చేసాయి.

స్టాకుల పరం గా నేడు భారతి ఎయిర్ టెల్ ౩ % నష్టపోయింది . జియాన్ టెలికాం తో విలీన ఒప్పందం చేసుకున్న కారణం గా , జియాన్ టెలికాం మూటగట్టుకున్న 39 % నష్ట భారాన్ని ఎయిర్ టెల్ మోయనున్నదని అంచనాల తో ఈ కౌంటర్ నష్టపోయింది. ఈ ఒప్పందం వలన అయిర్ టెల్ కౌంటర్ నష్టపోనున్నదని మేము ఇదివరకే సూచించిన విషయం విదితమే .

అంతర్జాతీయ ముడి చమురు ధరలు గరిష్టం గా $ 84 చేరుకోవటం తో Cairn 1.15 % , RIL 1.77 % లాభపడ్డాయి . 300 కోట్ల రూపాయలను అదనం గా ప్రభుత్వం నుండి అందుకోవటం తో UNION BANK OF INDIA 4% ఎగబాకింది. ధరలను 2 % - 4 % మేరకు పెంచినందున 1.76 % లాభపడింది. జాతీయ రహ దారుల పై టోల్ టాక్స్ ని ప్రభుత్వం పెంచటం తో NOIDA TOLL BRIDGE 3.22 % ఎగబాకింది. FY 10 లో నికర లాభం లో 37% వృద్ధి సాధించినందుకు BHEL 1.14 % లాభపడింది. నూతన కాంట్రాక్టు దక్కించు కున్నందుకు ABAN OFFSHORE 3 % ఎగబాకింది. మూడు రోజులు గా నష్టపోతున్న ఐ. టి స్టాకు ల లో నేడు షార్ట్ కవేరంగ్ నేపధ్యం లో కొనుగోళ్ళు కనిపించాయి.

నేడు విడుదల ఐన ద్రవ్యోల్బణ గణాంకాలను పరిశీలిస్తే ,మార్చి 20తో ముగిసిన వారాంతానికి పప్పుదినుసులు, పాల ధరలు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 16.35 శాతానికి చేరుకుంది. మార్చి 13 నాటికి ద్రవ్యోల్బణం 16.22 శాతానికి తగ్గి నాలగు నెలల క్రితం నాటికి చేరుకుంది. నిత్యావసర సరుకుల ధరల్లో ప్రధానంగా పప్పు దినుసుల ధరలు 31.55 శాతం పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగింది

ఇక సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే TCS 3.45 %, TATA STEEL 3.15 % అత్యధికం గా లాభపడింది. కాగా HUL 3.35% , BHART AIRTEL 3.13% మేరకు క్షేనించాయి.