- 01-4-2010
- మార్కెట్ నాడి
ఊహించని రీతి న అమెరికా లో ప్రైవేటు ఉద్యోగాల లో క్షీణత నమోదు కావటం తో గత రాత్రి అమెరికా మార్కెట్లు నష్ట పోయాయి. దీనితో లాభాల తో ప్రారంభమైన అమెరికా మార్కెట్లు చివరికి నష్టాల తో ముగిసాయి.
ఐతే లేహ్మన్ బ్రదర్స్ ఉదంతం అనంతరం , గరిష్ట స్థాయి లో ఉత్పత్తి దారుల సెంటిమెంట్ ఉన్నదని గణాంకాలు విడుదల కావటం తో నేడు ఆసియా మార్కెట్లు శుభారంభం చేసాయి.జపాన్ మార్కెట్లు 18 నెలల గరిష్ట స్థాయి లో ట్రేడ్ అవ్వటం నేటి విశేషం . అదే విధం గా గత రెండు సంవత్సరాలో నే ప్రపంచం లో అతి పెద్ద పబ్లిక్ ఇష్యూ DAI ICHI LIFE INSURANCE ,జపాన్ మార్కెట్ల లో భారి లాభాల తో లిస్టింగ్ కావటం తో ఈ ప్రభావం ఇతర ఆసియా మార్కెట్ల మీద సానుకూలం గా ఉంది. బలపడుతున్న కామోడిటి లు కూడా ఆర్ధిక వ్యవస్థ మెరుగు పడుతున్న దానికి సంకేతమన్న అంచనాల తో నేడు ఆసియా మార్కెట్లు లాభాల బాట పట్టాయి.
నేడు మన మార్కెట్ల పరం గా ఆలోచిస్తే, సింగపూరు లో ట్రేడ్ అవుతున్న నిఫ్టీ లాభాల తో శుభారంభం చేయటం మన మార్కెట్లకి కలిసొచ్చే అంశం . ఇతర అంశాలను పరిశీలిస్తే, మన దేశపు ఎగుమతి గణాంకాల లో 38 % వృద్ధి నమోదు చేయటం మార్కెట్లకు శుభసూచకం . వరుసగా నాలుగవ నెల ఎగుమతుల లో వృద్ధి సాధించటం విశేషం .ఈ అంశం వలన షిప్పింగ్ స్టాకులు కొంత సానుకూలం గా స్పందించే అవకాశం ఉంది . నేడు ఆహార ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ అంశం మన మార్కెట్లను , మధ్యాన్నం తదుపరి ప్రభావితం చేయనున్నాయి. గూడ్స్ రవాణా పై పన్ను భారాన్ని రైల్వే శాఖ రెండు నెలలు వాయదా వేయటం తో నేడు కామోడిటి , స్టీల్, సిమెంట్, బొగ్గు మున్నగు స్టాకులు స్వల్పం గా పెరిగే అవకాశం ఉంది.
నిన్న లాభాల స్వీకరణ తరువాత నేడు మన మార్కెట్లు నిన్నటి నష్టాలను పూరించు కునే దిశా గా నేడు లాభాల తో ప్రారంభం కానున్నాయి. ఐతే నేడు అమెరికా లో ఉత్పత్తి గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ అంశం అత్యంత కీలకం కాబట్టి మధ్యాన్నం నుండి మార్కెట్లు మరొక సారి అప్రమత్త ధోరణి తో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది.
రేపటి నుండి వరుస సెలవల కారణం గా ట్రేడర్లు తమ పోజిషేన్లను తగ్గించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మధ్యాన్నం తదుపరి మార్కెట్లు మరొక సారి ఆటుపోట్లకి గురి అయ్యే ప్రమాదముంది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు:: 17527
- మద్దత్తు స్థాయిలు : 17435-17345
- అవరోధాలు : 17558-17670-17780