• 31-3-2010
  • మార్కెట్ రిపోర్ట్

లాభాల తో శుభారంభం చేసిన మన మార్కెట్లు , మధ్యాన్నం తదుపరి మరొక సారి నష్టపోయాయి. దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 62 పాయింట్ల నష్టం తో 17527 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 13 పాయింట్లు కోల్పోయి 5249 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది.

నేటి ట్రేడింగ్ లొ మిడ్ క్యాప్ రంగం 0.25 % , స్మాల్ క్యాప్ రంగం 0.49 % చొప్పున లాభపడటం విశేషం . సేక్టరాల్ సూచీ ల లొ నేడు హెల్త్ కేర్ రంగం అత్యధికం గా 0.74 % లాభపడగా , పవర్ సూచీ 0.29 % ఎగబాకింది. కాగా నేడు కూడా ఐ.టి రంగం 1.18 % నష్టపోగా, FMCG రంగం అత్యధికం గా 1.36% క్షీణించింది.

స్టాకుల పరం గా హీరో హోండా , కంపనీ చరిత్ర లోనే అత్యధికం గా రూ. 80 బోనస్ ప్రకటించి నందుకు రెండవ రోజు కూడా నష్టపోయింది. స్పైస్ జెట్ ని కొనుగోలు కై ప్రయత్నిస్తున్న మారన్ కొనదలచిన రేటుని పెంచుతున్నట్లు వెలువడిన వార్త వలన ఈ కౌంటర్ 0.78 % బలపడింది. MAX NEW YORK లైఫ్ ఇన్సురన్సు లొ 4 % వాటాని కొనుగోలు చేస్తున్నందుకు యాక్సిస్ బ్యాంక్ 0.35 % నష్టపోయింది. ఏప్రిల్ మాసానికి గాను ప్రభుత్వం 20 లక్షల టన్నుల చెక్కర ని మార్కెట్ లొ విడుదల చేస్తున్నందున నేడు షుగర్ స్టాకులు కుదేలు మన్నాయి. BALRAMPUR CHINI 3.5 % , RENUKA 1 % నష్టపోయింది. ఐతే టాటా పవర్ తో ఒప్పందం కుదుర్చుకున్నందుకు రానా సుగర్స్ 20 % ఎగబాకింది. మురుగప్ప గ్రూపు నకు 37 % వాటాని సింగపూర్ DBS బ్యాంక్ అమ్మటం తో నేడు DBS CHOLAMANDALAM 4% ఎగబాకింది

సెన్సెక్స్ స్టాకు ల లొ నేడు HDFC 2.85 %,RCOM 2.62 % చొప్పున అత్యధికం గా లాభపడగా , TCS, ITC వాటాలు 2.49 % , 2.14 % చొప్పున క్షీణించి మార్కెట్ నష్ట పోయేందుకు కారణమయ్యాయి.