- 18-3-2010
- మార్కెట్ రిపోర్ట్
ట్రేడింగ్ చివరి నిమిషాలలో జరిగిన కొనుగోళ్ళ నేపధ్యం లో నేడు మన మార్కెట్లు స్వల్ప లాభాల తో ముగిసాయి . దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 29 పాయింట్లు లాభపడి17519 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 14 పాయింట్ల స్వల్ప లాభం తో5246 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ నేడు 17500 మార్కు దాటి ట్రేడింగ్ ముగించటం విశేషం
నేటి ట్రేడింగ్ లో ఆద్యంతం కూడా సెన్సెక్స్ పాయింట్ల పరిధి లో ఒడి దుడుకులకు గురయ్యింది. నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.37 శాతం, స్మాల్ క్యాప్ రంగం 0.06 శాతం లాభపడటం తో మార్కెట్లు లాభాల తో ముగిసేందుకు ఉపకరించాయి .
సెక్టోరల్ సూచీ ల లో నేడు బ్యాంకింగ్ ఇండెక్స్ అత్యధికం గా 0.61 శాతం లాభపడగా, టేక్ రంగం 0.57 శాతం ఎగబాకింది. కాగా FMCG ఇండెక్స్ 0.55 శాతం, PSU 0.4 రంగం శాతం కోల్పోయాయి.
నేటి ట్రేడింగ్ సమయం లో విడుదల అయిన ద్రవ్యోల్బణ గణాంకాలు కొంత ఊరట కలించటం కూడా మార్కెట్ల కి సానుకూలం అంశం గా మారింది. మార్చ్ 6 తాలూకు చెందిన ద్రవ్యోల్బణం 16 .30 % గా నమోదు అయ్యింది. అంతకు ముందు వారం ఇది 17.81 % గా ఉండింది.
నేడు విడుదల అయిన ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గుదల సూచించటం తో వడ్డీ ఆధారిత స్టాకులు ,నేటి ట్రేడింగ్ లో రాణించాయి . యక్షిస్ బ్యాంక్ 1.68 % ,ICICI బ్యాంకు 1.16 % లాభపడగా, నేడు లిస్టింగ్ అయిన UBI 4 % వృద్ధిని నమోదు చేసింది. విడియో కన్ఫెరెంసింగ్ గురించి పాలికొం తో ఒప్పందం ఖారు కావటం తో నేడు RCOM 2 % వృద్ధిని నమోదు చేసింది. కాగా 3 G సేవలకి టెండర్ దాఖలు చేయటం తో నేడు భారతి అయిర్ టెల్ కూడా 0.68 % వృద్ధిని నమోదు చేసింది. క్యుప్పో వైర్లెస్ కంపనీకి తమ ట వర్ల బిజినెస్ అమ్మినందుకు TTML 4.67 % లాభపడింది . మెటల్స్ స్టాకులు కూడా నేడు భారి గా లాభపడ్డాయి. JSWSL ,,SAIL సుమారు 2 % లాభపడింది.
నష్టపోయిన స్టాకుల లో నేడు ప్రధానం గా NMDC 1,46 % , ONGC 2 % ,MNM 3 %,TATAPOWER 1,27 % పేర్కొనవచ్చు .
మహానది బొగ్గు గనుల నుండి 17౩.24 కోట్ల ఆర్డర్లను సంపాదించటం తో MCNALLY BHARAT వృద్ధి చెందింది. KOVAI MEDICAL 11 % , PIRAMAL LIFE 11.5 %SHASUN DRUGS 10 % చొప్పున లాభపడి మదుపరులకు లాభాల పంట పండించింది.
సెన్సెక్స్ స్టాకు ల లో నేడు JAIPRAKASH 2.53 %, RCOM 2,11% లాభపడగా MNM 3.22 % ,ONGC 1.88 % మేరకు నష్టపోయాయి.