- 19-3-2010
- మార్కెట్ నాడి
గత రాత్రి మిశ్రమ గణాంకాల నేపధ్యం లో అమెరికా మార్కెట్లు ఫ్లాట్ గా ముగిసాయి. స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం, ఫిలడల్ఫియా ఉత్పత్తి గణాంకాల లో స్వల్ప పెరుగుదల, పెరిగిన నిరుద్యోగుల గణాంకాలు మున్నగు మిశ్రమ కారణాల వలన అమెరికా మార్కెట్లు ఆటు పోట్ల ను ఎదురుకుని ఫ్లాట్ గా ముగిసాయి. ప్రెసిడెంట్ ఒబామా కోటి ఉద్యోగాల కల్పని కి కీలక నిర్ణయం తీసుకోవటం అక్కడి మార్కెట్ల సెంటిమెంట్ ని కాపాడింది.
ఐతే నేటి ఆసియా మార్కెట్లు , నిన్న జరిగిన లాభాల స్వీకరణ అనంతరం మరొక సారి ఆటు పోట్లకి గురి అవుతున్నాయి. చైనా లో కీలక వడ్డీ రేటు ని పెంచి అక్కడి వృద్ధి రేటు ని కట్టు దిట్టం చేయాలని అక్కడి ప్రభుత్వ యోచన ఆసియా మార్కెట్ల లో కొంత మిశ్రమ ఒరవడి కి గురి చేస్తున్నది. ఐతే సింగపూర్ లో ట్రేడ్ అవుతున్న మన నిఫ్టీ లాభాల తో ప్రారంభమయ్యింది. కాబట్టి నేడు మన మార్కెట్లు స్వల్ప లాభాల తో ప్రారంభం అయ్యే సూచనలు మెరుగయ్యాయి.
కాగా ,ఐరోపా మార్కెట్లు నేడు అత్యంత కీలక దశ కి చేరుకొనున్నాయి . గ్రీస్ దేశపు ప్రెసిడెంట్ , తమ దేశాన్ని ఆదుకుంటారో ,లేదో స్పష్టం గా ఒక వారం రోజుల లో తెలియ చేయాలని యురోపియన్ యూనియన్ ని కోరట మయ్యింది. జర్మనీ ,గ్రీస్ కు ఆర్ధిక సహాయం చేసేందుకు సముఖం గా లేకపోవటం తో ఈ పరిణామానికి దారితీసింది. గ్రీస్ , ఈ విధం గా అల్టిమేటం ఇవ్వటం తో ఐరోపా మార్కెట్లు ఖంగు తిన్నాయి. ఈ దెబ్బతో యూరో కరెన్సి భారి గా పతనం అవుతోంది. ఈ కారణం గా నేడు మధ్యాన్నం తదుపరి మన మార్కెట్లు ఐరోపా మార్కెట్ల పోకడి కి మరింత గా ప్రభావితం అయ్యే సూచనలు ఉన్నాయి.
ఇక మన దేశపు పరిస్థిని ని విశ్లేషిస్తే, S & P సంస్థ మన దేశపు రేటింగ్ ని పెంచటం తో మన మార్కెట్ల సెంటిమెంట్ బలపడనున్నది. బడ్జెట్ విశ్లేషణ లో , ఇదే శీర్షిక లో , మన దేశపు రేటింగ్ త్వరలో పెరగనున్నదని మేము అనేక సార్లు ప్రస్తావించటం మీకు తెలుసు. మా అంచనాలను నిజం చేస్తూ ,మన దేశపు రేటింగ్ ని “ నిలకడ” గా S & P అభివర్ణించింది.
కాగా కేంద్ర వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ , మన దేశం లో ఉత్పత్తి కేందారల్ను స్థాపించాలని అమెరికా ని కోరనున్నట్లు ప్రకటించటం కూడా మన మార్కెట్లకు సానుకూల అంశం.
ఐతే పెరుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు గాను కీలక వడ్డీ రేటుని పెంచేందుకు, ఏప్రిల్ లో RBI విధానం ప్రకటన వరకు ఆగవలసిన అవసరం లేదని స్పష్టం చేయటం వలన , వడ్డీ రేటుని ఎప్పుడైనా రిజర్వు బ్యాంక్ పెంచగలదని చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఈ అంశం మన మార్కెట్లను కొంత బెంబేలు పుట్టించే అవకాశం ఉంది .
పై అంశాల వలన, నేడు మన మార్కెట్లు మిశ్రమంగా పయనిచే ఆస్కారాలు ఉన్నాయి .ఈ వారం ఇప్పటివరకు లాభాలను ఆర్జించిన మన మార్కెట్ల లో నేడు వారంతం కనుక మధ్యానం తదుపరి కొంత ఆటుపోట్లకి గురి అయ్యే అవకాశం ఉంది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- · గత ముగింపు:: 17519
- · మద్దత్తు స్థాయిలు : 17445-17351-17246-17180
- అవరోధాలు : 17528-17636-17730