- 18-3-2010
- మార్కెట్ నాడి
గత రాత్రి 17 నెలల గరిష్ట స్థాయికి అమెరికా మార్కెట్లు ముగిసాయి. ఫెడ్ ,కీలక వడ్డీ రెట్లని ఇప్పట్లో పెంచేది లేదని , ద్రవ్యోల్బణం ప్రస్తుతానికి సమస్య కాబోదని చేసిన ప్రకటన ని నిజం చేస్తూ గత రాత్రి విడుదల అయిన తయారి దారుల గణాంకాలు తగ్గుదల సూచించటం తో అమెరికా మార్కెట్లు భారి గా లాభపడ్డాయి.
ఐతే నేటి ఆసియా మార్కెట్లు మాత్రం గరిష్ట స్థాయి ల లో ప్రాఫిట్ బుకింగ్ కి గురి అవుతున్నాయి. ఐతే సానుకూలా అమెరికా మార్కెట్ల ప్రభావం వలన కామోడిటి మార్కెట్ల లో చమురు, ఉక్కు మున్నగు కామోడిటి లు బలపడుతున్నాయి. సింగపూర్ లో ట్రేడ్ అవుతున్న నిఫ్టీ నేడు ఫ్లాట్ గా ప్రారంభమయ్యింది.
మన మార్కెట్ల పరంగా ఆలోచిస్తే, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు మోన్ టెక్ సింగ్ అహు వాలియా , భారత దేశం లో ద్రవ్యోల్బణం ప్రధాన సమస్య గా మార నున్నదని . రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేటు ని పెంచవచ్చని తెలియచేయటం తో ప్రభూత్వం వడ్డీ రేటుని పెంచేందుకు రిజర్వు బ్యాంకు నకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయ్యింది. ఈ అంశం పై , ఈ నెల 27 న జరగబోయే రిజర్వు బ్యాంక్ సమావేశం లో ప్రాధమిక చర్చ చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ కారణం గా మార్కెట్ల లో , ముఖ్యం గా వడ్డీ రేటు ఆధారిత స్టాకులు కొంత బలహీన పడే అవకాశం ఉంది.
పైగా నేడు విడుదల కానున్న ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఈ అంశం పై తీవ్ర మైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే గరిష్ట స్థాయి ల కి ఎగబాకిన మార్కెట్ల లో లాభాల స్వీకరణ కి అదను చూసుకుంటున్న పంటర్లకు ద్రవ్యోల్బణ అంశం ప్రధాన ఆయుధం గా మారనున్నది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- · గత ముగింపు:: 17490
- · మద్దత్తు స్థాయిలు : 17445-17351-17246-17180
- అవరోధాలు : 17528-17636-17730